పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


టిపూ మాటను గౌరవించి ఉంటే ఈనాడు ఈ నేల మీద మేం పాలకులుగా ఉండేవాళ్ళం కాదని' బ్రిటీష్‌ అధికారులే ప్రకటించారంటే టిపూ ప్రయత్నాలు ఎంతటి ప్రాముఖ్యతగలవో అర్థం చేసుకోవచ్చు.

1799 మే 4న బ్రిటీష్‌ సైన్యంతో పోరాడుతూ టిపూ సుల్తాన్‌ అమరుడయ్యారు. టిపూ మృతి చెందారని తెలిసి, స్వయంగా వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, మరణాన్ని నిర్ధారణ చేసుకున్న తరువాతగాని బ్రిటీష్‌ సైనికాధికారి జనరల్‌ హారిస్‌ ఈనాటి నుండి ఇండియా మనదేశమనిప్రకటించేసాహసం చేయలేకపోయాడంటే, ఇండియాను కబళించాలని కలలు కంటున్న బ్రిటీష్‌ పాలకులకు మైసూర్‌ పులి ఎంతగా ఆటంకమయ్యాడో గ్రహించవచ్చు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం

టిిపూ తరువాత 1857లో మొగల్‌ పాదుషా బహద్దాూర్‌ షా జఫర్‌ నాయకత్వంలో సాగిన సమరం ప్రదమస్వాతంత్య్ర సంగ్రామంగా ప్రసద్ధి చెందింది. ఈపోరాటంలో భాగంగా అవద్‌కు చెందిన బేగం హజరత్‌ మహాల్‌ విదేశీ పాలకులతో పోరాడి వారిని తరిమికొట్టి,చుట్టుముట్టీన శతృబలగాలను సవాల్‌ చేసి 14 మాసాల పాటు నిలువరించి, కలసి వచ్చిన స్వదేశీ పాలకులకు స్పూర్తినిస్తూ, సంక్లిష్ట సమయంలో రాజ్యభారాన్ని వహించింది. స్వయంగాగా ఏనుగు అంబారినెక్కి ఆంగ్లేయులతో సాగిన పోరాలలో ఆమె పాల్గొంది.

స్వదేశీపాలకులను, ప్రజలను హెచ్చరిస్తూ, ఆంగ్లేయుల కుట్రలను తేటతెల్లం చేస్తూ, విక్టోరియా మహారాణి ప్రకటనకు దీటుగా బేగం హజరత్‌ మహల్‌ చారిత్మ్రాక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన ఈ విధగా సాగింది. '....హిందూ-ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రదానం. ఈ అంశాలను కేవలంస్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంటకలుపుతున్నారు. స్త్రీల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు...హిందూ-ముస్లిం పౌరులను హెచ్చరిసున్నాం. ఆత్మగౌరవంతో, ధర్మ బద్ధంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి. స్వదేశీ సైన్యంలో

19