పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

పోరుబాటలో అపశృతులు

1761లో ప్రారంభమైన ఫకీర్ల-సన్యాసుల పోరాటం, కాలం గడిచే కొద్ది ఉధాతమై పలు విజయాలు సాధించింది. అణచివేత, దోపిడు, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ప్రత్యేక పరిస్థితులలో ఉనికిలోకి వచ్చిన ఉద్యమం, కాలగమనంలో పలు కారణాల వలన బలహీనపడింది. ప్రధానంగా ఫకీర్లకు ఆధునిక ఆయుధాలు తగినంతగా లేకపోవడం, పోరాట వీఎఉలకు అవసర మైనంత శిక్షణ కర వుకావటం, ప్రజలలో అసంతృప్తిని నివారించడానికి కంపెనీ పాలకులు చర్యలు తీసుకోవటం, క్షామం తరువాత ప్రకృతి సిద్ధమైన అనుకూల వాతావరణం ఏర్పడటంతో, ప్రతికూల పరిస్థితులను ఫకీర్ల పోరాటం ఎదుర్కోవాల్సి వచ్చింది.

కంపెనీ అధికారుల దుష్ట పాలనకు వ్యతిరేకంగా తిరగబడటం మాత్రమే ఫకీర్లు చేసారు తప్ప పాలనాపరమైన వ్యవస్థను పటిష్టంగా రూపొందించాలని సంకల్పించలేదు. ఆనాటి స్వ దేశీ పాలకులను గౌరవిస్తూ , పాలనాధి కారాన్నిచేపట్టి ప్రజలకు చేయూతనివ్వాల్సిందిగా కోరారు గాని, తామే పాలనా వ్యవస్థను చేపట్టే ఆలోచనలు చేయలేదు.ఫకీర్ల ధార్మిక దృష్టి కూడా అందుకు అనుమతించక పోవటం వలన, కంపెనీ పాలకులమీద సాధించిన ఘన విజయాలను వ్యవస్థాగతం చేసుకోలేదు. ఆయా ప్రాంతాలలో ప్రజల అవసరాలను బట్టిపోరాడటం, ఎక్కడికక్కడ విజయాలు సాధించి, ప్రజలను పీడన నుండి విముక్తి గావించి తృప్తిపడి సరిపెట్టుకున్నారు తప్ప, రాజ్యం రాజ్యాధికారం అను ఆలోచన చేయలేదు.

ఈ పరిణామాలకు తోడుగా కంపెనీ పాలకుల వద్దనున్న ఫిరంగుల్లాంటి ఆధునిక ఆయుధాలు, సమాచార వ్యవస్థ, సుశిక్షితులైన సాయుధ బలగాలతో సుదీర్గ… పోరాటం చేయటం ఫకీర్లకు కష్టసాధ్యమైంది. ప్రతికూల పరిస్థితులలో కూడా సాధించిన విజయాలు సంపాదించి పెట్టిన గౌరవం, ప్రజలలో పెరిగిన పలుకుబడి, సంపాదించుకున్న సంపద, అంతర్గత విభేదాలు, కంపెనీ పాలకుల కుట్రలు అన్నీ కలిపి ఫకీర్ల ఉద్యమానికి విషమ పరిస్థితులను సృష్టించాయి. సమర్ధుడైన మజ్నూషా ప్రతికూల పరిస్థితులన్నిటినీ చాకచక్యంగా పరిష్కరించుకుంటూ, ప్రతి ప్రతికూలతనూ అనుకూలంగా మార్చుకుంటూ అప్రతిహతంగా ముందుకు సాగారు. ప్రధానంగా పీర్‌-మురీద్‌ల మధ్యనున్న బలమైన ధార్మిక సంబంధం మూలంగా ఫకీర్లలో సుస్థాపితమైన ఐక్యతను శతృవు తక్షణమే గండికొట్టలేకపోయాడు. ఆ తరువాత కాలం గడిచేకొద్ది సహజంగా ఉద్యమం బలహీనపడసాగింది.

చివరి పోరాటం

1786 డిసెంబర్‌ 29వ తేదీన మజ్నూషా తన అనుచరులతో బగూరా జిల్లా ముంగ్రా గ్రామంలో విడిది చేసిన లెఫ్టినెంట్ బ్రివాన్స్‌ బలగాలను ఆకస్మికంగా చుట్టుముట్టారు. బలహీనపడుతున్న ఫకీర్ల ఉద్యమానికి జవసత్తాలు అందించాలని మజ్నూ షా భావించారు. కంపెనీ బలగాల మీద సాహసోపేతంగా దాడి జరిపి, అనుచరులలో నూతన ఉత్తేజం కల్పించాలని, అనుచరుల మధ్యన ఏర్పడిన వివాదాలకు స్వస్తి చెప్పాలని సాహస దాడి