పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

26


జరిపారు. ఆ సమయంలో, గతంలో అనేకసార్లు తమ కళ్ళ ఎదుటనే తప్పించుకుపోయిన మజ్నూషాను ఎలాగైనా బంధించాలనే పట్టుదలతో కంపెనీ పాలకులు, భారీ బలగాలతో ముంగ్రాలో మజ్నూ షా కోసం ఎదురుచూస్తున్నాయి.

ఆ వాతావరణంలో జరిగిన సాహస దాడి భీకరంగా సాగింది. పలువురు గాయపడ్డరు. మజ్నూ షా అతి లాఘవంతో కత్తి తిప్పుతూ, శత్రువును దరిచేరనివ్వకుండ జాగ్రత్తపడుతూ రణభూమిలో వీర విహారం చేస్తూ, అరివీర భయంకరంగా పోరాడారు. అ దాడిలో మజ్నూషాను తుపాకీ గుండు తాకి తీవ్ర గాయమైంది. రక్తం ఓడుతున్నాలెక్క చేయక అత్యంత వేగంతో తన గుర్రం మీద దూసుకపోతున్న మజ్నూ షా కంపెనీ బలగాలు ఎదురుపడిప్పటికీ, ఆయనను చుట్టుముట్టి నా బంధించలేకపోయాయి. గతంలో చిక్కినట్టే చిక్కి అతి లాఘవంగా, అత్యంత వేగంతో గుర్రపు స్వారీ చేస్తూ తప్పించుకుని పోయిన మజ్నూ షా ఈసారి కూడా తమ కళ్ళ ఎదుటనే మటుమాయమయ్యారు. ఆయన ఆవిధంగా తప్పించుకుని పోవటం సహించలేని ఆంగ్లేయ అధికారి లెఫ్టినెంట్ బ్రివాన్స్‌ గాయపడిన మజ్నూ షాను వెంటాడాడు. అనుచరుల రక్షణ వలయం, ప్రజల సహాయంతో మజ్నూ షా ఆంగ్లేయులకు టోకరా ఇచ్చి చివరకు తప్పించుకున్నారు.

మహా సేనాని అస్తమయం

కంపెనీ సైనికాధికారి లెఫ్టినెంట్ బ్రివాన్స్‌ కళ్ళుగప్పి, తాను పుట్టి పెరిగిన మాఖన్‌పూర్‌కు మజ్నూ షా సురక్షితంగా చేరుకున్నారు. బలమైన గాయాలు కావటంలో ఆయన పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అనుచరులు ఆందోళన చెందారు. అనుచరులు, సహచరులు మజ్నూ షాను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయతిత్నించారు. చికిత్స నిమిత్తం మజ్నూ షాను మరొక ప్రాంతానికి తరలించటం సాధ్యం కాలేదు. గాయాల నుండి అత్యధిక రక్తం స్రవించటం వలన మజ్నూ షా కదలలేనంతగా బలహీనమైపోయారు. కంపెనీ బలగాలను, బ్రిీటీష్‌ సైన్యాధికారులను గడగడలాడించిన మహానాయకుడు మృత్యువుతో పోరాటం ప్రారంభించారు. సుదీర్గ… పోరాట చరిత్రలో శత్రువు వలయం నుండి చాకచక్యంగా పలుమార్లు తప్పించుకున్న మజ్నూ షాకు ఈసారి మృత్యువునుండి తప్పించుకునే అవకాశం లేకపోయింది. శత్రువుతో పోరాడుతూ మృత్యుముఖం చేరినా క్షేమంగా తిరిగి రాగలిగిన వీరుడు మజ్నూ షాను ఈసారి మృత్యువు వడిసి పట్టుకుంది. ఈ విధంగా బాధాసర్పద్రష్టులైన ప్రజల ముద్దుబిడ్డడు, బ్రిీటీషర్ల మీద తొలి తిరుగుబాటు జెండాను ఎగురవేసిన మజ్నూ షా, చివరకు తన పూర్వీకుల గడ్డ, మాఖన్‌పూర్‌లో అస్తమించారు.

అన్నకు తగ్గ తమ్ముడు మూసా షా

అసమాన పోరాట యోధుడు మజ్నూషా ఫకీర్‌ కన్నుఇమూయగానే ఫకీర్ల ఉద్యమం అంతరించిపోయిందని సంతసించిన కంపెనీ పాలకులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అలుపెరుగక ఫిరంగీల మీద పోరు సల్పిన మజ్నూ షా స్పూర్తిని ఆయన సోదరుడు మూసా షా కొనసాగించారు. మజ్నూ షా శిష్యుడు కూడా అయినటువంటి మూసా షా పోరాట బాధ్యతలను స్వీకరించారు. అన్నకు ఏ మాత్రం తీసిపోకుండా ఫిరంగీలను ముప్పుతిప్పలు పెట్టారు. కంపెనీ పాలకులతో గెరిల్లా పోరాట పద్ధతులతో పోరు సల్పటమేకాక,