పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయంలో పరిశీలించాను. సౌలభ్యం కొరకు వీటిని మానవ స్వభావం: సహనశీలత, స్నేహం, మూర్ఖత్వం, దౌష్ట్యం, వాక్శుద్ధి - వాచాలత్వం, కపటం, డంబం, సోమరితనం, దురాశ, కృతఘ్నత, లోభం, తారతమ్యం, చిన్నచూపు, అహం, ద్వంద్వ ప్రమాణం, భోజన ప్రియత్వం అను 16 ఉపవర్గాలుగా పునర్విభజించాను.

రెండవ అధ్యాయం 'తెలుగు, బెబులు సామెతలు: ఉపదేశం.' సామెతల ముఖ్య ెప్రతిపాదానలు పలు రకాలు. కొన్ని నలుగురి గమనంలో ఉన్నదానిని ఉన్నట్లు చెప్పి ిఊరుకుంటాయి. మరికొన్నిటిలో హితబోధ, ఉపదేశం కరతలామలకమై సామెత వినగానే చటుక్కున స్ఫురించే విధగా ఉంటుంది. 'తినడానికి తిండి లేదు గాని తనవారికి తద్దినాలు', లేదా 'అప్పుచేసి పప్పుకూడు' అనగానే ఇక్కట్లలో ఉన్నప్పుడు డాబుసరి పనికిరాదు (సీరా 18:13) అనే హితోపదేశం ప్రత్యక్షమై ఆకట్టుకొంటుంది. ఈ కోవకు చెందిన సమానార్డకాలైన తెలుగు, బెబులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలించాను.

మూడవ అధ్యాయం 'తెలుగు, బెబులు సామెతలు: సార్వత్రిక సత్యాలు.' సార్వత్రిక సత్యాలు ఎప్పుడైనా, ఎక్కడైనా - తెలుగు నేల మీదానైనా, ఇశ్రాయేలు కొండల మీదనైనా - ఒకే విధగా ఉంటాయి. 'ఆకలి రుచి ఎరుగదు' 'పుట్టినవాడు గిట్టక తప్పదు' మొదలనవి సార్వత్రిక సత్యాలు. ఇవి ఎక్కడెనా, ఎప్పుడెనా ఒకే విధగా ఉంటాయి. ఈ అధ్యాయంలో పరిశీలించినది ఇలాంటి సామెతల జతలనే.

నాలుగవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: నమ్మకాలు, విశ్వాసాలు.' ఈ అధ్యాయంలో నమ్మకాలు, విశ్వాసాలను గురించి చెప్పే సమానార్దకమైన తెలుగు, బైబులు సామెతలను పరిశీలించాను.

అయిదవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: స్ర్తీ.' సామాజిక, కౌటుంబిక జీవితాలలో స్త్రీకి ముఖ్య స్థానమున్నది. తల్లిగా, తోబుట్టువుగా, భార్యగా, బిడ్డగా ఎన్నోరూపాలలో జీవించి మరెన్నో అనుభూతులకు కారణమయ్యే స్త్రీమూర్తి సామెతలలో ప్రఖ్యాత వస్తువు. అందువలన స్త్రీలకు సంబంధించిన సమానార్థక తెలుగు, బైబులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలించాను.

ఈ భాగంలోని చివరి రండు అధ్యాయాలు చాలా చిన్నవి. అందుకు కారణం ెఈ అంశాలకు చెందిన సమానార్ధకాలైన తెలుగు, బైబులు సామెతలు తక్కువగా ఉండడమే.


4