పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీటిలో ఆరవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: వ్యవసాయా'నికి సంబంధించినది. వ్యవసాయం మానవ జీవనాధారం. అందువవలన ప్రతి భాషలోనూ వ్యవసాయ సంబంధిత సామెతలుండడం సహజం. ఈ అధ్యాయంలో తెలుగు, బైబులు సామెతలలో వ్యవసాయానికి సంబంధించిన సమానార్థకాలైన అయిదు సామెతలను పరిశీలించాను.

ఏడవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: ఇతరాల'కు సంబంధించినది. మొదట పరిశీలించిన ఆరు అధ్యాయాలలో ఒదగని సమానార్ధకాలైన మిగిలిన తెలుగు, బైబులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలించాను.

ఆ తరు వాత తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనంలో నేను కనుగొన్న వాటిని ఉపసంహారంలో సంతరించాను. అటుపిమ్మట అనుబంధంలో పరిశీలించిన సమానార్ధకాలైన తెలుగు, బెబులు సామెతల జాబితాను, చివరగా ఉపయుక్త గ్రంథాల పట్టికను పొందుపరిచాను.