పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జానపద విజ్ఞాన న్వరూప న్వభావాలను, జానపద విజ్ఞానంలోని విభాగాలను, జానపద విజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన పరిశోధనలను గురించి న్థూలంగా వివరించాను.

రెండవ అధ్యాయం సామెతకు నంబంధించినది. ఈ అధ్యాయంలో మొదట వివిధ భాషలలో సామెతకున్న పేర్లను పేర్కొని, సామెతకు అరిసావటిలర నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రనిద్ధి చెందిన నిర్వచనాలను నమీక్షించి, సామెత లక్షణాలను వర్గీకరణ పద్ధతులను వివరించాను. అటుపిమ్మట తెలుగు సామెత సైద్ధాంతిక నేపథ్యమున్నది. దీనిలో సామెత శబ్దవిచారం, తెలుగు సామెతకు పండితులు ఇచ్చిన వివిధ నిర్వచనాల నమీక్ష, తెలుగు సామెత లక్షణాలైన పోలిక, న్పషవత, నంక్షిప్తత, శ్రావ్యత, ప్రాచుర్యత, అనుభ'వ మూలకత, ధ్వని, సాంప్రదాయికతలకు నంబంధించిన వివరణం, తెలుగు సామెతల పుటువ పూర్వోత్తరాలు, న్వరూపం, వర్గీకరణ పద్ధతులకు చెందిన నమాచారమున్నది. ఆ తరువాత ఉన్నది బైబులు పరిచయం. దీని తరువాత హీబ్రూ సామెత మాతాలరకు నంబంధించిన సైద్ధాంతిక నేపథ్యమున్నది. దీనిలో మాతాలర కున్న అర్థం, బైబులులో మాతాలర పదప్రయోగం, మాతాలర నిర్వచనం, నేపథ్యాలు, మూలాలు, లక్షణాలు, న్వరూపం గురించి వివరించాను. ఈ అధ్యాయంలో చివరగా సామెతల నేకరణం, అధ్యయనం, తెలుగు సామెతల నేకరణం, తెలుగు సామెతల మీద ఇప్పటివరకు జరిగిన పరిశోధనలను నమీక్షించాను.

ఈ పరిశోధనా గ్రంథంలో రెండవ భాగం తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనానికి నంబంధించినది. ఈ భాగంలో మొదటగా తులనాత్మక సాహిత్యం అంటే ఏమిటో న్థూలంగా వివరించాను. ఆ తరువాత నమానార్థకాలైన 215 తెలుగు, బైబులు సామెతలను వాటిలోని విషయాన్ని ఆధారంగా చేనుకొని 7 అధ్యాయాలలో పరామర్శించాను. ప్రతి అధ్యాయంలోని జంట సామెతలను తెలుగు సామెత ఆధారంగా అకారాది క్రటమంలో పేర్చాను. ఈ తులనాత్మక పరిశీలనానికి ఎన్నుకున్న బైబులు సామెతలను 'పవిత్ర గ్రంథము-క్యాతలిక్‌ అనువాదము' నుండి గ్రహించాను.

ఈ తులనాత్మక పరిశీలనంలోని మొదటి అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: మానవ స్వభావం.' ఒక చేతి వ్రేద్ళు ఒకేలాగా ఉండవు. అలాగే లోకములో ఉన్న మనుషుల న్వభావాలు కూడా ఒకేలాగా ఉండవు. అందువలన విభిన్న మానవ న్వభావాలకు చెందిన నమానార్థకాలైన 77 తెలుగు, బైబులు సామెతలను ఈ

3