పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జానపద విజ్ఞానాన్ని ఇంగ్లీష్‌ లోని ఫోక్‌లోర్‌ (folklore) కు సమానార్దకంగా మనం తెలుగులో వాడుతున్నాం. ఫోక్‌లోర్‌ అనే పదాన్ని విలియం జాన్‌ థామ్స్‌ William John Thoms - (1803-85) క్రీ.శ 1846 లో రూపొందించాడు. ఇది క్రీ.శ. 1787లో జోసెఫ్‌ మాదెర్‌ - Joseph Mader- (1754 - 1815) ఉపయాగించిన "Volks kunde" అను జర్మన్‌ పదానికి ఆంగ్లానువాదం. జాన పదులకు చెందిన ఆచారాలు, నమ్మకాలు, కథాగేయాలు, సామెతలు మొదలైన వాటిని సూచించడానికి థామ్స్‌ ఫోక్‌లోర్‌ ను వినియోగించాడు.2


జానపద దశ నుండి వసున్న ఆచారాలను, నమ్మకాలను, సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్న ప్రదశాన్ని జనపద అని చెప్పుకోవచ్చు. అందుకే జానపద విజ్ఞానం 'సజీవ శిలాజం' (Living Fossil) వంటిదని విద్వాంసులు పేర్కొన్నారు. అంటే నేటి నాగరిక సమాజంలో ఉండడానికి వీలుకాని సంప్రదాయాలను, ఆచారాలను జనపద కాపాడుతుందని, అందుకే అది సజీవ శిలాజం వంటిదని వారి అభిప్రాయం. కాబట్టే జానపదా విజ్ఞానం గతానికి చెందిన ప్రతిధ్వనీ, వర్తమానానికి చెందిన శక్తివంతమైన గొంతుక" ' అని ప్రముఖ జానపద విద్వాంసుడు రిచర్డ్‌ ఎమ్‌.డార్సన్‌ అన్నాడు.3


కాని,19వ శతాబ్దంలో ఫోక్‌లోర్‌ లోని 'ఫోక్‌' ను నిర్వచించిన విద్వాంసులు జానపదులంటే విద్యావిహీనులైన కర్ష క జనులనీ, గ్రామీణులనీ అభిప్రాయపడ్డారు. జానపద విజ్ఞానానికి సంబంధించిన వివిధ విషయాలు నేటికీ ఎక్కువగా గ్రామాలలోనే లభిసున్నాయనడంలో సందేహం లేదు. అంత మాత్రాన అవి నగర ప్రాంతాలలో ఉండవని మనం భావించలేము. ఉదాహరణకు నేడు ఒక జనసమూహానికి చెందిన వారు పల్లెలలో ఉన్నా, పట్టణాలలో ఉన్నా పుట్టుట దగ్గర నుండి గిట్టుట వరకు పాటించే ఆచారాలు, సంప్రదాయాలు ఒకే తీరులో ఉండడాన్ని మనం గమనిసున్నాం.


2 of the Anlchor Bible Dictionary David Noel Freedmann (Doubllellday,New york 1992) Vol.2. p813'

3."Folklore is an echo of the past, but at the same time it is also the vigorous voice of the present". Folklore and the Folklife, Introduction, Richard M.Dorson (ed.). 1972 p.17 as quoted by ఆర్వీవేయన్ సుందరం. ఆంధ్రుల జానపద విజ్ఞానం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు. 1983. పు.20