పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

|.సైద్ధాంతిక నేపధ్యం


1. జానపద విజ్ఞానం

తన గతానికి గర్వించని జాతి గతించి పోతుంది ( A nation will perish unless it cherishes its past) అంటుంది ఒక ఆంగ్లసామెత. ఒక జాతి గతం గురించి తెలుసుకోవడానికి ఆ జాతి సంస్క ృతి మూల సాధనం. సంస్క ృతికి సమగ్ర నిర్వచనం ఇంత వరకు రూపొందలేదు. అందువలనే The New Encyelopaedia Britanica పదహారవ సంపుటం 874వ పుటలోక్రోయెబర్( A.L.krOeber), క్లైడ్‌ క్లుకోన్‌ ( clyde kluckhohn) లు సంస్కతికి 164 నిర్వచనాలను ఉటంకిస్తూ, భాషలు, భావాలు,నమ్మకాలు, ఆచారాలు, నిషేధాలు, స్మృతులు, వ్యవస్థలు, పనిముట్లు, కళలు, కర్మకాండలు, దుస్తులు, ఆటలు మొదలైనవన్నీ సంస్క ృతిలో అంతర్భాగాలని పేర్కొన్నారు. స్థూలంగా సంస్కృతి అంటే ఆదిమానవుని కాలం నుండి నేటి నాగరికమానవుని వరకు ఆయా కాలాలలో మనిషి తన అభ్యున్నతి కొరకు చేసిన కృషి అని భావించవచ్చు.1

సంస్కతిని అది ప్రవర్తిల్లిన కాలాన్ని బట్టి , ప్రాంతాన్ని బట్టి 1. ఆటవిక 2.జనపద

3. నాగరిక సంస్కస్కృతులుగా విద్వాంసులు విభజించారు. మనిషి సంచార జీవిగా అడవులలో వేట ద్వారా తన ఆహారాన్ని సంపాదించుకున్నదశకు చెందినది ఆటవిక సంస్కతి. మనిషి స్దిర నివాసాన్ని ఏర్పరచుకొని తన ఆహారాన్ని తాను ఉత్పత్తి చేసు కున్నదశకు చెందినది జానపద సంస్కస్కృతి. మనిషి సాంకేతిక విజ్ఞానంతో, యాంత్రికాభివృద్ధితో జీవిస్తున్న ప్రస్తుత దశకు చెందినది నాగరిక సంస్కస్కృతి. విటిల జానపద సంస్కతికి సంబంధించినదే జానపద విజ్ఞానం.

జానపదవిజ్ఞానుల వర్గీకరణం ప్రకారం సామెతలు జానపద విజ్ఞానం లోని ఖిక జానపద విజ్ఞానానికి చెందినవి. అందువలన ఈ అధ్యాయంలో జానపద విజ్ఞానం అంటే ఏమిటొ, దానిలోని విభాగా లేమిటొ స్దూలంగా తెలుసుకుందాం.


1 ఆర్వియన్. సుందారం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1983, పు 1