పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

45


బసవనచరిత్రము

(బిజ్జలరాయనిచరిత్రమును బట్టి)

బిజ్జలుఁడు జైనుఁడు. బసవనకుఁ బద్మావతియని పేరు గల తోఁబుట్టువు గలదు. ఆమెను బిజ్జలుఁడు పరిగ్రహించెను. పద్మావతిమీఁది వ్యామోహమున బిజ్జలుఁడు జాగ్రత్తగొనక రాజ్యభారమును మంత్రియగు బసవన కప్పగించెను. మాలలు మాదిఁగలు మొదలగు తక్కువజాతులవాండ్రకు లింగములుగట్టి మాహేశ్వరులని పేరుపెట్టి కులమర్యాదలను సదాచారములను వీటిఁబుచ్చి బసవన గొప్పసాంఘికవిప్లవము గలిగించెను. రాజుప్రాభవమును గుంచించెను; అకృత్యము లనేకములు గావించెను; జైనులను జంపించెను. బిజ్జలున కీతని దుష్పరిపాలనము దుస్సహముగా నుండెను. పరస్పరము వారిలో వైమనస్య మేర్పడెను. కొల్లాపురపు శిలాహారరాజయిన మహామండలేశ్వరుని జయించి కల్యాణమునకుఁ దిరిగివచ్చుచుండగాఁ బసవన పంపిన జంగమొకఁడు జైనవేషముతో వచ్చి దర్శించి బిజ్జలునకు విషఫల మొసఁగెను. దానిని వాసనచూచి యాతఁడు మృతిఁజెందెను. చనిపోవుచుఁ దన కుమారుఁడయిన యిమ్మడి బిజ్జలునితో "బసవన చేయించిన పని యిది! కావున వానిని జంపుము” అని చెప్పెను.

బిజ్జలుని తర్వాతఁ దత్పుత్రుఁడయిన యిమ్మడిబిజ్జలుఁడు రాజయి బసవన్నను బట్టుకొనుటకయి తన దండనాయకులను నియోగించెను. జంగముల ననేకులను బాధించెను. కేరళదేశమునకుఁ బారిపోయి బసవన్న యక్కడ నిమ్మడిబిజ్జలుని సైనికులరాకకు జడిసి బావిలోఁ బడి మృతిఁజెందెను. ఆతని భార్య నీలమ్మ విషము తిని చచ్చెను. “మరణాంతాని వైరాణి” గనుక నిమ్మడిబిజ్జలుఁ డంతతో శాంతుఁడయ్యెను. చెన్నబసవన్న తన మేనమామయగు బసవన్నకున్న ధనకనకవస్తువాహనాదులను రాజున కిచ్చివేసెను. రా జనుగ్రహింపఁగాఁ జెన్నబసవన్న రాజమంత్రి యయ్యెను.

ఏది విశ్వాస్యము?

ఇట్లు బసవని చరిత్రము మూఁడు గ్రంథములందును భిన్నవిధములతో నున్నది. వీనిలో విశ్వాస్య మేది యని యించుక విచారింపఁదగును. బసవపురాణము