పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

29


వైష్ణవము వీడినతర్వాతిపేరు గావచ్చును. మల్లికార్జునస్వామిని దర్శింపకపోవుటచేఁ గనులుపోవుట, అట్లు పోవుటకుఁ గారణమడుగఁగా శ్రీపతి (అహోబలనృసింహుఁడు) శివుఁడే కర్తయని తెలుపుట కృత్యాది పద్యమునఁ గలదు. సభలందు భక్తులు జయించుట, శివానుగ్రహమునఁ బోయినకన్నులు మరల వచ్చుట రగడలోఁ గలదు.

మఱికొన్ని గాథలు

మఱియు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోని స్థానిక చరిత్రములందును గర్ణాటకవిచరిత్రమునను గూడ నీ క్రింది విషయములు గలవు :

సోమనాథుఁ డోరుఁగంటిలో నుండఁగాఁ బెరుగుకురికి శాస్త్రి, నేతికురికి శాస్త్రియని యిర్వు రాతనితో వివదించిరట; పాలకురికిలో నుండి వచ్చినవారే గదా పెరుగురికి నేతికురికి శాస్త్రులని యవహేళనముచేసి సోమనాథుఁడు వారిని జయించెనట!

గణపుర ప్రభువయిన జగదేకమల్లునిచే సోమనాథుఁడు లింగముద్రతో గొంత భూమిని బడసెనట.

సోమనాథుని నిష్ఠలు, నియమములు

ఈతఁడు చతుష్షష్టిశీలసంపన్నుఁడని పలువురు చెప్పిరి. చతుష్షష్టిశీలముల వివరణమున కిది చోటుగాదు. 'భవిజన దర్శన స్పర్శ నాలాప వివిధ దానాదాన విషయదూరగుఁడ'నని యీతఁడు చెప్పుకొన్నాఁడు. శైవేతరుల (భవుల) మొగములఁ జూడమని శైవులును, వైష్ణవేతరుల మొగములఁ జూడమని వైష్ణవులును వ్రతములు పూనుట గలదు! అట్టివారు నేఁడునున్నారు!

సోమనాథుని వైదుష్యము

సోమనాథుని పాండిత్యవిశేషము చతుర్వేదసారమునను, పండితారాధ్యచరిత్రమునను, బసవరాజీయము (సోమనాథభాష్యము) నను గాననగును. వేదములనుండి, పురాణములనుండి శివపారమ్యప్రతిపాదకములయిన