పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

బసవపురాణము


శివభక్తిదూషకులు చెడిపోదురని కంటి
..................................................................
త్రిభువనము భక్తులకుఁ దృణకణంబని కంటి
సభలందు భక్తులకుఁ జయవాదమని కంటి
......................................................................
.....................................................................
గౌరీశుఁడే సర్వకర్తగాఁ బొడగంటి
కారుణ్యమున శివుఁడు గనిపించెనని కంటి
.....................................................................
బహుపాపములు నన్నుఁ బట్టువిడుచుట గంటి
నయముగా నయనములు నాకీయఁ బొడగంటి
...........................................................................
భయభక్తులను భర్గుపాదములు పొడగంటి
నిది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి
నిది యోగమని కంటి నిది భోగమని కంటి
నిది ధర్మమని కంటి నిది మర్మమని కంటి
నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి
నింక శ్రీగిరిఁ జేర నేఁగందునని కంటి
శంకరుని కృపవడయు సమయ మిదియని కంటి
నింక నాయెత్తు కృతు లిత్తునని పొడగంటి
నింకఁ గృతి సెప్ప నాకేమి భరమని కంటి
వడిఁగృతుల్ నాయెత్తు వచ్చునని పొడగంటి
తనర శ్రీరంగకవి దాతయని పొడగంటి
భువిలోపలఁబ్రసిద్ధ పుణ్యుఁడని పొడగంటి.”
           * * *

సోమనాథపురాణ, గురురాజచరిత్రములందు రంగనాథుఁడని పేరుండఁగా నీ రగడలో 'శ్రీరంగకవి' యని పేరున్నది. రెండు నొక్కనిపేళ్లే కావచ్చును; ఇది