పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

233

గ్రక్కునఁగ్రోలుమీ కఱకంఠదేవ - వెక్కసం బేలయ్య విమలాత్మదేవ
గొగ్గవ్వ మహదేవి గుడ్డలదేవి - దుగ్గళదేవి సద్యోజాతదేవి
యమ్మవ్వ సకళవ్వ యచలదేవమ్మ - నిమ్మవ్వ శాంతవ్వ బమ్మలదేవి
కాళవ్వ గేతవ్వ గామలదేవి - షోళశి బసవమ్మ సోమలదేవి
సంగవ్వ శివదేవి సాకలదేవి - లింగవ్వ రెబ్బవ్వ మంగళదేవి
ప్రమథవ్వ బాచవ్వ పదుమలదేవి - విమలవ్వ సెల్లవ్వ వీరభద్రవ్వ
చిక్కలరామవ్వ సిద్ధలదేవి - యక్కవ్వ సోడవ్వ యానందదేవి
హొల్లవ్వ గల్లవ్వ హొన్నలదేవి - హల్లవ్వ మల్లవ్వ యనిమిషదేవి
కేతలదేవి పురాతవ్వ మీర - లేతెంచి కూర్చుండుఁడీ బంతి ననుచు
సల్లీల వెండియుఁజతురతాన్యోన్య - సల్లాపసూక్తులు సరసమై తనర
నిట్టిసందడి యెన్నఁడెఱుఁగ మే మనుచు - దట్టుఁడు బసవన దా నెర్గుననుచు
దమ్మయ్య కడు పారెఁదడవకు మనుచు - నిమ్మాటికిని మిక్కి లింకఁదే ననుచు
నోయన సడలింపు మొడ్డాణ మనుచు - నీయాన నా పొట్ట నిండెరా యనుచుఁ
గడుపు దిగ్గెడిని నీల్గకుము నీ వనుచుఁ - గడుపు వెర్గినఁదెత్తుగాకేమి యనుచు
నయ్యకుఁదలమున్కలయ్యెఁబొమ్మనుచు - నియ్యయ్య కింతట నేమయ్యెననుచు
నిది వెద్ద గాదువో యీ యయ్య కనుచు - వదలింపు గట్టినవలువ నీ వనుచుఁ
బోనిత్తునే [1]నుస్లిపోయిన ననుచు - మానుఁడా సరసము ల్మాతోడ ననుచు
నాయయ్యఁ జూడుఁడీ యాస్వాదమనుచు - నీ యందు నేమేనిఁబోయెనే యనుచు
నుత్తమాంగమున నో రున్నఁగాకనుచుఁ - జిత్తము నున్నట్లు చెప్పెఁబొమ్మనుచు
గప్పెర నిండినఁగాని పోననుచు - గుప్పునఁదెమ్ము వేర్కొని గ్రుక్కెఁడనుచుఁ
దలయూఁపులకు రాకు దండ్రి నీ వనుచు - వలెనటె మాతోడ వాగ్వాద మనుచుఁ
గడుపు దా మాయయ్య వడసెరా యనుచు - బడుగుమాటలవేల బంతిలో ననుచు
దప్పిపోవునె యూఁది త్రావిన ననుచుఁ - గొప్పెరకును గంతు గొందుఁగా కనుచుఁ
[2]క్రేళ్లువాఱక యారగింపు రమ్మనుచు - నల్లవో బలిసెరా నా యయ్య యనుచు
నేలతెచ్చెదు దేకు మిచ్చటి కనుచు - మేలుబంతికి [3]నీవ చాలుదే యనుచు
నోయయ్య తెత్తునా యొక్కింత యనుచు - నా యయ్య చాలురా నాకింక ననుచు
ద్రేన్పకపోదునే దేవ యే ననుచు - ద్రేన్పఁగ నైనను దెఱపి లే దనుచుఁ

  1. నుసుల్ వో
  2. కెల్లు
  3. నిదిసాలునే