పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

బసవపురాణము

శాపింతు నఱికింతు సందుసందులకుఁ - ద్రోపింతు వాండ్ర నధోగతి ననుచు
దండియై బసవనదండనాయకుఁడు - చండేశనుతుఁడు శ్రీ సంగమేశునకు
సర్పాంకునకుఁదద్విషంబు సద్భక్తి - దర్పం బెలర్ప సమర్పణచేసి
పసిగమై నారగింపఁగ నార్చిపేర్చి - వెస ననివారితోద్వృత్తిఁజెలంగి
యరగలిగొనక కొప్పెరలకు నొరగి - పరమ మాహేశ్వరప్రకర ముప్పొంగి
జుష్టంబు “బ హ్వపి స్తోక మేవాపి - శిష్ట మన్నం విమిశ్రిత” మనుఁగాన
పసిఁడిగలంతెలఁబసిఁడికోరలను - బసిఁడికర్పరములఁబసిఁడిముంతలను
వారక యిటుగూడ వడ్డించికొనుచు - మారారి కర్పించి మహనీయలీల
“చిందక క్రోలుము సిక్కయ్యదేవ - సందడిసేయకు సంగయ్యదేవ
తెచ్చెదఁజుమ్మయ్య త్రిపురారిదేవ - విచ్చేసి కూర్చుండు విమలాత్మదేవ
కాలకంఠయ్యకుఁజాలదు దెండు - చాలుఁబో నీకు సిరాళ దేవయ్య
వేగ మింతేలయ్య విరుపాక్షదేవ - యీ గరిఁటెఁడుఁజాలు భోగయ్య కింకఁ
జాలదో తెత్తునా శంకరాచార్య - ఫాలలోచన పట్టు పట్టు మీసారె
యెంతైన నాస్వాదమే పురాతయ్య - చింతింపలేదువో శివదేవుఁడింక
మిగిలిన నాక చూ జగదేవతందె - నగవులఁబోదువో గగనేశ్వరుండ
కొంకకు గొంకకు శంకరదేవ - యింకను దెత్తునా లెంక మంచయ్య
పాడియే వలదనఁబర్వతదేవ - కూడ వడ్డింపుఁడీ గురుదేవనికిని
శివశివ తనియండు సిన్న దేవుండు - ప్రవిమలదేవుండు బాస సెల్లించె
ముద్దులాడక పట్టు మూర్తి దేవయ్య - దొద్దయే యెంతైన ధూర్జటిదేవ
సంబరపడకయ్య సర్వజ్ఞదేవ - కెంబావిభోగయ్య గేలియే నీకు
నీకొలఁదెఱుఁగమే నిజభావదేవ - పట్టుము మహలింగదేవ
సంతసంబే నీకుఁజంద్ర శేఖరుఁడ - మంతనం బేల నిర్మలదేవ నీకు
[1]నుసులకు నుసులకు గుసుమేశ్వరుండ - కసిమసంగెదవేల కల్లి దేవయ్య
[2]సడ్డ లిం తేలయ్య షొడ్డలదేవ - వడ్డింతుమే నీకు దొడ్డలింగయ్య
మీసలు దీర్పకు మిండసంగయ్య - బాసలువలుకకు బల్లాణదేవ
కడుపారఁగ్రోలుమా కళ్యాణదేవ - గుడికెఁడు దెత్తునా గొల్లవరాయ
చిక్కంగనీకుమా శ్రీగిరినాథ - మొక్కలం బిదియేల ముదునూరిదాసి

  1. మసులకు మసులకు మాహే
  2. స్రడ్డ