పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

బసవపురాణము

బళ్లెరం బలుఁగులువాఱెరా యనుచుఁ - బెల్లు వడ్డించితి వ్రేలెద వనుచు
నొలుకఁబోయకు మఱి యోయయ్య యనుచు - నొలికినబసవనికుండుఁగాకనుచు
దెరలోని కొప్పెరల్ దెండు దెండనుచు - హరహర దాఁచెదమయ్య నీ కనుచుఁ
గొనితెచ్చి వడ్డింపఁగ్రోలుచు భక్త - జనులఁదోతెండంచు ననురాగలీల
శివున కర్పింపుచు శివశివ యనుచు - నవధానవంతులై యారగింపుచును
జుఱ్ఱుజుఱ్ఱనఁగొని సొగయుచు గఱ్ఱు - గఱ్ఱనఁద్రేన్చుచుఁగాళ్లు సాఁచుచును
నిక్కుచు నీల్గుచు నక్కిలింపుచును - జొక్కుచుఁజోలుచుఁజక్కిలింపుచును
నక్కిలిపడి ఱెప్పలల్ల మోడ్చుచును - గ్రుక్కిళ్లు మ్రింగుచుఁగుత్తుక బంటి
గ్రోలుచు [1]నలరుచుఁ గ్రాలుచు నాత్మ - సోలుచు సుఖవార్దిఁదేలుచు వేడ్క
వ్రాలుచు మెఱయుచు వక్షంబులందు - నోలిఁబళ్లెరముది క్కొయ్యన మరలి
చూచుచు నించుకించుక వుచ్చికొనుచు - లేచుచుఁజెలఁగుచు లీలఁదలిర్ప
నాడుచుఁగప్పెర లఱచేత నొలయఁ - బాడుచు నుఱుకుచుఁబరువు వెట్టుచును
మురియుచుఁగునియుచు [2]ముఱకటింపుచును - యొరగాలనిలుచుచు సరసమాడుచును
నేతెంచి మ్రొక్కుచుఁ జేతులుసాఁచి - ప్రీతిఁబ్రసాదంబుఁబెట్టించికొనుచుఁ
గర మనురక్తిమైఁగౌఁగిలింపుచును - నరుదొంద బొత్తుల నారగింపుచును
నొండొరుముందట నున్న పళ్లెరము - లొండొరు లొడియుచు నుబ్బి యార్చుచును
విషమాక్షసద్భక్త వితతి యిబ్భంగి - విషమవిక్రమలీల విషకేలి సలుప
దండియై బసవనదండనాయకుఁడు - చండేశవరద ప్రసాదశేషంబు
గొట్టరువులవారిఁగుంచెలవారి - గొట్టుబోయల నాలవట్టాలవారి
పట్టపుదేవుల భ్రాతల హితులఁ - జుట్టాలఁబక్కాల సుతులఁబౌత్రులను
బండారులను నడబాళ్లఁబ్రెగ్గడల - దండనాయకులను దంత్రపాలకుల
దాసజనులను విశ్వాసుల భట్ల - దాసీజనముల విలాసినీజనులఁ
దతవితతాది వాద్యవిశారదులను - జతురగాయక నిజస్తవపాఠకులను
బండిత నర్తక పరిహాసకులను - మండితసత్కవి మండలి నెల్లఁ
బంతులు సాగఁగఁబంచి వారలకు - వింతవేడుక వుట్ట విషము వోయింపఁ
గాలకూటము వారిపాలికి నెయ్యి - పాలునై యుండఁగ బసవన్న మఱియుఁ
గాలాగ్ని రుద్రుని గణనాథు దాయ - కోలాహలంబును గుంజరోత్తంసు

  1. నాత్మలోఁగొని సుఖవార్ధిఁ - దేలుచు వేడ్కలఁగ్రాలుచు మఱియు
  2. ముఱుకటింపుచును