పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

211

కల్లి[1]దేవయగారు వ్రల్లదు లనఁగ - నెల్లెడ వినము మీ రల్లసర్పమును
బడసిననాఁడొండెఁబొడగంటి మిపుడు - పొడగంటి మెన్నఁడుఁబొడగానరాదు
మంచివారని మిమ్ము మన్నింతు మేము - క్రించుబోయత మమ్ముఁగొంచెంబుసేసెఁ
[2]జంటివిప్రుఁడు గాఁడు సాక్షాద్వసిష్ఠు - [3]వంటియుత్కృష్టవిద్వాంసుఁడట్లయ్యు
వేదులవారి దామోదర[4]యజ్వ - గాదిలియగు త్రివిక్రమసోమయాజి
సమిధల కీగుళ్లసంది వోవంగఁ - బ్రమసెనో దాను నప్పాట వచ్చుచును
దనుఁజోఁకె వీరిచే యనుచు మీదాసి - తనతలకడువ యత్తఱి వ్రేసెఁ బగుల
వినుము శూద్రులుముట్టినను బ్రాహ్మణులకు - మును సచేలస్నానములు సేయవలయు
నని చెప్పుఁగాక యీ యధమవంశజుల - కును ద్విజులను ముట్టఁజన దని కలదె
యేనీతి యేధర్మ మేపురాణోక్తి - యేనాఁటిభక్తి సహింపఁగఁదగునె
మగువ నచ్చోటన మాయించు టపుడు - దగవుగా దని కాక దండింపలేఁడె
భూమిఁబుట్టనిమార్గములు సేయఁదగునె - యే మెదురెదుర మి మ్మేమందుమింక'
ననవుడుఁగల్లి దేవయ్య యింకేల - ననుమాన మనుచు నిట్లనియె వారలకు
'నింటిదాసులకు నెట్లంటనౌ భక్తు - లింటికుక్కలకు మి మ్మంట [5]రా దనిన
బ్రాహ్మణులేమీరు? "బ్రహ్మచరంతి - బ్రాహ్మణా” యన మీకు బ్రాహ్మ్యమెక్కడిది
పాన లేటికిఁబరబ్రహ్మం బనంగ - దీనికి నర్ధంబుఁదెలుపుఁడా చాలుఁ
బరమేశ్వరుండన్నఁబరమాత్ముఁడన్నఁ - బరికింపఁగాఁబరబ్రహ్మం [6]బటన్న
హరుఁడె కా కొరులకుఁబరశబ్ద మెద్ది - పరశబ్ద ముత్కర్ష పరము గావునను
నొరులకుఁగల్గునే యుత్కర్ష పదము - హరియును బ్రహ్మయుఁబరమాత్ము లెట్టు
లరయంగ వేదశాస్త్రార్థంబులందు - హరిముఖ్యు లెల్ల జీవాత్ముల కాన
ధరణిఁబరబ్రహ్మ హరుఁడు బ్రహ్మంబు - చరియించువారు మా సద్భక్తవరులు
హరియును బ్రహ్మయు నమరవల్లభుఁడు - పరము నర్చనసేయుభక్తులు గారె
ధృతిని "'బ్రహ్మాధిపతి ర్బ్రహ్మణో౽ధి - పతీ” యనియెడుఁగాదె శ్రుతిసమూహంబు
కావున బ్రహ్మమార్గం బెద్ది మిమ్ము - భావింప ముట్ట సంభాషింపఁదగునె
యేతెఱంగునఁబాసె నెఱుఁగరే మీరు - జాతిశూద్రత్వంబు వ్రేతవిముక్తి
రుద్రేతరక్రియల్ రూపింపఁ[7]గలవొ - రుద్రుండు దక్కంగ శ్రుతికర్త గలఁడొ
మృడునిభక్తులతోడ మీ రెల్ల సరియె - నుడువులు గలవేని నో రెత్తుఁ' డనిన

  1. దేవ(వు)నివారు
  2. జంది
  3. నంది
  4. యొజ్జ
  5. ఁగా
  6. బునన్న
  7. గలరో