పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

బసవపురాణము

'నక్కటా యిదియేల యందర[1]మమ్ముఁ - గుక్కలకంటెను దక్కువగాఁగఁ
బలికెదు మీపిన్న పాపచెయ్దంబు - కొలఁదియే మొదలికి గుద్దలిగొంటి
ముదలింప ముదలింప ముల్లు(లుపు?)చ్చి పెద్ద - పద రడ్చినట్లయ్యె నది సెప్పనేల
చదివింతుగాక మీ శ్వానంబు నొక్క - పదఖండవర్గంబు వనన యెం దైన'
నని విప్రు లందఱు నాగ్రహింపంగ - విని కల్లిదేవయ్య విప్రులఁజూచి
యనియె 'రోఁకటి పాట లట్ల వేదములు - [2]పనుగొన మా శివభక్తులయిండ్ల
సారమేయములకు ధారుణి' ననుచు - నారంగఁగల్లిదేవయ్య నవ్వుచును
దాఁబిల్చె వేదపితామహాఖ్యుండు - నాఁ బొల్చుశునకంబు నలిఁజిట్ట [3]మిడిచి
'యుచ్చుచ్చి రే శంకరోచ్ఛిష్టభోగి - యుచ్చుచ్చిరే ప్రణవోదాత్తయోగి
యుచ్చుచ్చి రేయాగమో త్కృష్టభోగి - యుచ్చుచ్చిరే మహాంహోదూరచరిత
యుచ్చుచ్చిరే వీరసచ్చరనిరత - యు(చ్చు)చ్చి రేయపునర్భవోన్నతస్థిరత'
యని యిటులెలుఁగించునమ్మాత్రలోనఁ - జనుదెంచిశునకంబు దనకు మ్రొక్కుడును
వరదయాంచితసుధావార్ధి నోలార్చి - యరుదొందఁగల్లిదేవయ్య యిట్లనియె
'నేవేదమం దైన నెత్తి యందొక్క - ఠా వనుష్ఠింపుమా యీ విప్రులెదుర'
ననవుడు శునకచర్మావృతరుద్రుఁ - డనుషక్తిఁ బద్మాసనాసీనుఁడగుచుఁ
గఱకంఠు నాత్మాబ్జకర్ణికఁజేర్చి - గుఱి నాదిశక్తి నాకుంచనఁగూర్చి
యాసూర్యు మెట్టి సుధాసూతిఁగట్టి - నాసాగ్రమునదృష్టి నలి నాఁటుకొలిపి
యకలంక మృదుమధురకళానియుక్తి - సుకరనాదోక్తి విశుద్ధస్వరమునఁ
ద్ర్యక్షరబిందు నాద ప్రయుక్తాంచి - తాక్షర మోంకారమట్లుచ్చరించి
నంతలోననె తద్ధరామరానీక - మంతంతధరణి సాష్టాంగంబు లిడఁగ
దయనుదాత్తానుదాత్తస్వరిత ప్ర - చయములు సాంగమై సంధిల్లి తనరఁ
బదమును గ్రమమును [4]బాటయు జటయు -విదితంబుగా నాల్గు వేదంబు లందు
నొక్కొక్కఠావెత్తి యొగి ననుష్ఠింపఁ - గ్రక్కునఁదాలేచి కల్లిదేవయ్య
హోమానువేదపితామహా" యనుచుఁ - దామాన్చెశునకమధ్యయనంబుసేఁత
వింటిరే చెవులార విప్రు లందఱును - గంటి రే భక్తుల ఘనమహత్త్వంబు
ననుచు నా కల్లిదేవయ్య వేదంబు - జను లెఱుంగఁగఁగుక్కఁజదివించె మఱియు
నఘవైరి సిద్ధరామయ్యగారింట - నుఘెకాళికాఁడన నొక గుక్క గలదు

  1. ఁదమ్ము
  2. పనుగొను
  3. లిడుచు
  4. పాది, పాడి