పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

203

వేయేల [1]వ్రేవాడ వెన్న మ్రుచ్చిలుచుఁ - బోయి ఱంకాడఁడే పొలఁతులతోడ
నోలి నందీశ్వరు నూర్పులఁదగిలి - పోలేక వచ్చుచుఁబోవుచుండండె
హరి దాన దైవంబ నని జగం బెఱుఁగ - నురులింగమూర్తిచే నుబ్బణంగండె
మృడుఁ బెక్కుయుగములు మేఘరూపమునఁ - గొడుకు నర్థించి దాఁగొలువఁడే
మత్స్యావతారంబు మడియించి కాదె - మత్స్యకేతనవైరి మఱి తలఁకజుట్టె (శార్‌ఙ్గి
పరగఁదత్కూర్మకపాలంబు గాదె - హరుహారమధ్యంబునం దున్న యదియు
బ్రాంతిగా నాదివరాహదంష్ట్రంబు - ఖ్యాత మీశ్వరుచేతఁగాదె యున్న యదియు
శరభరూపము దాల్చి పొరిమాల్చికాదె - నరసింహుతోలు శంకరుఁడు దాఁగట్టె
పొట్టి త్రివిక్రము నెట్టెమ్ముగాదె - పట్టె ఖట్వాంగము భాతి శంకరుఁడు
నగ్రజుఁడగు విష్ణు నక్కళేబరము - నుగ్రాక్షుమూఁపున నున్నదే కాదె
మా దేవదేవుని పాదపీఠమునఁ - గాదె లక్ష్మీశ్వరుక న్నున్నయదియు
మృడుఁడు విష్వక్సేనుఁబొడిచి యెత్తుడును - గడఁగి శూలంబునఁగాదె యున్నాఁడు
అత్తఱిఁగలికేతుఁడై కేశవుండు - నెత్తురు వఱపఁడే నిటలాక్షుమ్రోల
సంతతంబును శ్రుతిసన “హరిగుంహ - రంతం” బనుచు మ్రోయు రౌద్రభావమున
[2]హరిని హరించుట హరిహరుండయ్యె - హరుఁడు సేతోజాతహరుఁడఘహరుఁడు
శ్రుతులు "యజ్ఞస్య శిరోభిన్న” మనఁగఁ - గ్రతుపురుషుని జంపఁ గడుఁగోపమునను
వెనుకొని తునుమఁడే వీరభద్రుండు - చని కేశవునితల జన్నంబులోన
నవలేపమునఁ బొంది దివిజాధ్వరమునఁ - దివిరి విష్ణుఁడు దలఁదెగఁగొట్టువడఁడె
యతఁ డేల యెవ్వఁ డహంకరించినను - రతిపతిహరునిచే బ్రతుకఁగఁగలఁడె
వసిగొని హరియు దేవతలు నెత్తంగ - వెస నోపిరే యక్షవినిహితతృణము
మించి మున్ బ్రహ్మ గర్వించిన శివుఁడు - త్రుంచివైవఁడె వానిపంచమ శిరము
హరిణమై కూఁతురివరియింప నజుని - హరియింపఁడే మృగవ్యాథ రుద్రుండు
అతనిపుత్రుండు నహంకారియగుడు - క్షితి నుష్ట్రమైయుండఁజేయఁడే హరుఁడు
వాసుదేవుండు దైవంబనియెత్తు - వ్యాసుని చేయి నిహత మయ్యెఁగాదె
యదిగాక గర్వించినట్లి రావణుని - నదుమఁడే శివుఁడు వాదాంగుష్ఠ మంద
మలహరుతో మాఱుమలసి కాముండు - నిలయెల్ల నెఱుఁగ నేఁటేఁటఁ గాలండె
కాలుని శ్వేతునికై చంపెఁగాదె శూలంబునఁను బొడ్చి సురలెల్ల నదర

  1. వ్రేపల్లె
  2. హరిని హరింపఁడె హరిహరుం డనెడి