పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

బసవపురాణము

రమణఁ'దద్విష్ణోః పరం పద' మనఁగ - నమర విష్ణునకుఁబరమమైనపదము
శ్రుతి “సదా పశ్యంతి సూరయో” యనఁగ - గతకర్ము లీశుండ కాఁగనియుండఁ
గుమతులై కర్మశాస్త్రములవెంబడిని - బ్రమసియో యిలఁగుక్కపాలు ద్రాగుటనొ
మఱి నాము మేసియో మతిమాలినట్టి - యఱవపాఱులమాట లవనీశ వినకు
మపునర్భవత్వంబు నచ్యుతత్వంబు - నుపమింప విష్ణున కున్నదే యెందు
పూని మా భృగుశాపమున నచ్యుతుండు - తా నుదయింపఁడే దశజన్మములను
సామ మా 'విష్ణుః పితామహా' త్తనఁబి - తామహునకు హరి దాఁబుట్టెఁడాదె
యజునిగుదంబున హరి వుట్టుటకును - నిజనామ మది యథోక్షజుఁడయ్యెఁగాదె
యదిగాక యదితి కింద్రానుజుఁడనఁగ - నుదయించెఁగాదె పయోజనాభుండు
ఆదట ద్వాపరమందు విష్ణుండు - బాదరాయణుఁడనఁబ్రభవించెఁగాదె
యయ్యుగంబునను మున్నచ్యుతుం డుదయ - మయ్యెనుగాదె కృష్ణాఖ్యుండునాఁగ
విష్ణుఁడొక్కొక్కెడ విలయంబుఁబొంద - విష్ణుత్వ మర్థించి విశ్వేశుఁగొలిచి
యొక్కొక్కఁడుదయించె నొగి విష్ణుఁడనఁగ - నెక్కడఁబట్టి యింకెన్ని జన్మములు
నతనిబాములు విను మవనిపాలుండ - శ్రుతిమూలముగఁజూడు ప్రతివాద[1]మనక
తగిలి దూర్వాసుండు దన్నినఁగాదె - నగధరువక్షంబునను మచ్చయయ్యె
హరిని రుక్మిణిఁగూడ నట్లును గాక - కరమర్థితో బండిగట్టి తోలండె
యమృతాబ్దిసేవన నయ్యుపమన్యుఁ - డుమియఁడే కుత్తుకనున్న కేశవుని
హరిని జలంధరుం డనునొక్కయసుర - పొరిమాల్చెఁగాదె నభోమార్గమునను
చలమరి యొక జరాసంధునకోడి - యిల దుర్గమును బన్నఁడే కేశవుండు
నవ్విష్ణు నిభదానవాదిరాక్షసులు - మువ్వురు సలపట్టు టెవ్వరు వినరె?
యేచి విష్ణుండు దధీచిఁజక్రమున - వైచుడు వీ పొగ్గి యాచక్రమపుడ
తునియలుగాఁగొట్టుచును నతం [2]డెగుదఁ - గనుకనిఁదలవీడఁగాఁబాఱెఁగాదె
మును మృగచండాలమను గార్దభంబు - వనజాక్షు ప్రాణంబు సనఁగాచెఁగాదె
హరుఁడు విసముద్రాగి యమృతంబుఁ బనుప - హరి మగఁటిమి [3]విడ్చియాఁటదిగాఁడె
బలిఁగిట్టి భువిఁగొన్నపాపంబుకతన - యిలగోలుపడి హరి జలధి సొరండె
యాలిఁగోల్పడి రాముఁడట బ్రహ్మహత్య - పాలయి ధర చుట్టు భ్రమరించెఁగాదె
పోటరి విష్ణుండు బోయచేఁగాల - నేటువ డీల్గఁడే యిల యెల్ల నెఱుఁగ

  1. మేల
  2. డెగువ, నెదురేఁగ
  3. చెడి