పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

బసవపురాణము

దక్షుండు గర్వించి తలఁగోలుపడుట - సాక్షిగా దెట్లు మేషంబుశిరంబు
ఆది దా నఖిలలోకాధ్యక్షుఁడన్నఁ - గాదె భగాదిత్యు కన్నులు వెఱికె
దూషించి పలుక రుద్రుం డనుగణము - పూషుని పండ్లూడఁబొడిచెను గాదె
తానచూ యీ జగత్ప్రాణుఁడ నన్నఁ - బూని త్రుంపఁడె పవమానునికాళ్లు
ద్రోహిచే నాఁడాహుతుల్ గొని కుడిచి - బాహుజిహ్వలు గోలుపడియెఁబావకుఁడు
ననిమిషాధిపుచేయి యదితినాసికము - దునుమఁడే వీరభద్రుండు రౌద్రమున
నమృతాంశుమేను వాదాంగుష్ఠమునను - జమరఁడే యతఁడు యజ్ఞమున కేతేర
సయ్యన మును సరస్వతి ముక్కుఁగోసి - [1]వయ్యఁడే నాఁటియధ్వరములోపలను
వెండియుఁగ్రొవ్వినవేల్పుల నెల్ల - దండించుచును జగద్రక్షణార్థముగ
ముల్లోకములఁగూడ ముంచినగంగ - మల్లికాదలభాతి మౌళిఁదాల్పండె
త్రిపురంబు లతిదుర్నిరీక్ష్యమై తిరుగఁ - ద్రిపురారి వోడేర్చుతివుటఁగాల్పండె
నే లెల్ల మోవఁగఁజాలిన శేషు - వ్రేలిముద్రికగాఁగఁదాలిచెఁగాదె
సంగతి విషవహ్ని జంబూఫలంబు - మ్రింగినభావన మ్రింగఁడే హరుఁడు
నంధక కరిదైత్య వ్యాఘ్ర లాలాజ - లంధరాదుల నిర్దళనము సేయండె
యింతింతవనులకు నీశ్వరుం డేల - కంతుసంహరు నొక్కగణము సాలండె
యొకశివగణముచే సకలలోకములు - ప్రకటంబుగాఁజెడుఁబ్రభవించు మించు
నన మహాదేవు మహత్త్వంబునకును - నెన యున్నదే యింక నిన్నియునేల
నిత్యుండ నేన యనిత్యు లందఱును - సత్య మిట్లనుచు సజ్జనసాక్షికముగ
నిత్యస్వరూప వినిశ్చితదృష్ట - ప్రత్యయంబుగఁదాల్పఁబడియున్న యట్టి
హరివిరించుల కపాలాస్థిమాలికలు - కరి గాదె యీశుండు కర్త యౌటకును
నదిగాక యుపమన్యుఁడను మునిచేతఁ - బదపడి శివదీక్షఁబడసి విష్ణుండు
[2]సొంపున నింద్రనీలంపులింగంబు - నింపార సజ్జయం దిడి కొల్చెఁగాదె
వెన్నుండు దా నిత్య వేయుఁదామరల - నున్నతిఁబూన్ప నం దొకటి లేకున్నఁ
గన్నప్డువుచ్చి శ్రీకంఠుఁబూజించి - కన్నును నాఁటి చక్రముఁ బడయండె
మత్స్యావతారుఁడై మఱి లంకలోన - మత్స్యకేశ్వరు నిల్పి మఱి కొల్చెఁగాదె
మున్ను దోరసముద్రమునఁగూర్మనాథుఁ - బన్నుగాఁగూర్ముండు భక్తిఁగొల్వండె

  1. వెయ్యఁడే యధ్వరవేళఁదెల్లముగ
  2. పెంపున