పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

195

బసవయ్య మొదలుగా భక్తులు దాను - నసమమొడ్డోలగంబై యున్న యెడను
వింతచే నానందవిభ్రమంబెసఁగ - నంతంతఁబాడంగ నంతంత నాడ
నదెవచ్చె వచ్చె వియన్మండలమున - నిదెవచ్చెవచ్చు సోమేశుండనంగ
నీరధు లేడు ఘూర్ణిల్లినభాతి - సారగంభీరవాద్యారవంబెసఁగ
భోరన మ్రోయుచప్పుడు వినఁబడఁగ - సౌరాష్ట్రనాథుఁడాశ్చర్యంబెలర్పఁ
దివిరి కొట్టరువు గాదియ వ్రచ్చికొనుచు - భువిఁబ్రతిష్ఠుండయ్యె నవని గంపింప
'సిద్ధరామయ్య దా శ్రీగిరికేఁగి - శుద్ధాత్ము మల్లికార్జునునిఁబ్రార్థించి
కొనుచు నా సొన్నలికను పురంబునకుఁ - దానెట్లు రప్పింపఁగా నేరఁడయ్యె
నిప్పు డిచ్చటనుండి యీ బాచతందె - రప్పించుకొనియెఁ [1]జేరఁగ సోమనాథు
నిట్టిధన్యుఁడు గల్గునే' యని భక్తు - లిట్టలంబుగ నుతియించుచునుండ
నచ్చెరువందుచు నా బిజ్జలుండు - వచ్చి సాష్టాంగుఁడై వడిఁబ్రణమిల్లి
సకలనియోగంబు జయవెట్ట బసవఁ - డకలంకలీల బాచయ్య నంకింప
వలివేగమున గాదియలు వడఁద్రోచి - నెలకట్టుకట్టించి నిమిషమాత్రమున
వరరత్నఖచితసువర్ణాలయంబు - విరచించి కోటగోపురము లెత్తించి
ప్రవిమలోద్యద్భక్తి బాచిరాజయ్య - శివరాత్రినియమంబు సెల్లించెనంత
నలిఁగొట్టరువు సోమనాథు డనంగ - వెలసె లోకావలి వినుతింపుచుండఁ
దెల్లగాఁషొడ్డలదేవు బాచయ్య - సల్లీల సద్భక్తి కెల్లయై పరగ
లలినన్యసమయ కోలాహలమహిమ - కిల బిజ్జలుండు సహింపక మఱియుఁ
గుమతియై యప్పురిసమయులుఁదాను - రమణఁబ్రతాపనారాయణపురిని
గోవిందప్రతిమ సద్భావంబెలర్ప - గావించి యొకగుడిఁగట్టించి మంచి
దినమున నతనిఁబ్రతిష్ఠగావించి - యనురాగలీలమై నంతఁ [2]గొల్విచ్చి
యున్నెడ నఖిలనియోగంబు గొలువ - నన్నరేంద్రుండు దా నందఱఁజూచి
“బాచిరా జటయేమి భక్తుండ ననియొ - యేచియో యీ కార్య మెఱుఁగఁడో
తా లెక్కసేయక తమకొలువొల్లఁ - డో లీల నిట్టి యొడ్డోలగంబులకుఁ(యెఱిఁగి
జనుదేరకుండు టే”మని యాగ్రహింప - మనుజేశునకు బసవనమంత్రి యనియెఁ
దవిలి నీయుడిగంబుఁదప్పించెనేని - బవరంబు ముట్టినఁబాఱెనేనియును
దప్పని దండింపఁ దగ వగుఁగాక - యిప్పరదైవంబు [3]లిండ్లిండ్లకడకు
నేల రా వనవచ్చునే పతి వీవు - జోళవాళిక కాక వేళవాళికిని

  1. బోరన
  2. గొల్వించి
  3. లిండ్లకునతని