పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

బసవపురాణము

బాలెంతలంజియపడపట్ల రాచ - యూళిగంబును భక్తియును గూర్చి నడవ
సౌరాష్ట్రమున కీవు సనుము గాదేని - సౌరాష్ట్రనాథుఁడు సనుదేర నిమ్ము
శివరాత్రి గివరాత్రి సేయుట మాను - తవిలి యీయుళిగంబు దప్పింపరాదు”
అనుచు నప్పరవాదులనుమతంబునను - జనపతి వారించుడును బోక నిలిచి
“ముదలించి పలుకుడు మూర్ఖుఁడై పోక - యదియుఁగష్టముగాదె యతఁడన్నయట్లు
వచ్చు నిచ్చటికొండె వరదుఁడు నాకు - నచ్చటి కేఁగున ట్లయ్యెడు నొండె
దీనఁదప్పినదేమి నా నిజవ్రతము - తా నెట్లు శివునకుఁదప్పింపవచ్చు”
ననుచు నిశ్చింతాత్ముఁడై యున్న యెడను - ఘనుఁడు సోమేశుఁ డాదినము దొల్నాడు
[1]మడఁపులేఖయు నందిపడగయుఁగొనుచుఁ - బడిహారిక్రియఁబట్టపగలె యేతెంచి
కొట్టరువునఁబళ్లు గొలిపించుచుండ - నట్టిచో బాచయ్య కాతఁడిట్లనియె
“సౌరాష్ట్రనాథుండు సనుదెంచుచుండి - భోరన ముందఱఁబుత్తెంచె నన్ను
శంకరు నానతిఁజదువుకో లేఖ - యింకిటపూఁటకు నేఁగుదెంచెడిని
నాసక్తిమై నింక ననిశంబు మీని - వాసంబునన యుండవలయుఁ గావునను
నీ పెద్ద గాదియలోపలఁగొలుచు - వేపోయఁబనుపుము వెడలి సోమేశుఁ
డచ్చోటఁబ్రత్యక్ష మయ్యెడి” ననుచు - నచ్చుగాఁజెప్పుచు నతఁడదృశ్యముగఁ
“జనుదెంచు నిచటికి సౌరాష్ట్రనాథుఁ - డనుమాన ముడుగుఁడీ యదియెట్టు లనిన
వచ్చెనే మున్ను రావణుని మన్నించి - యచ్చోన చిక్కెఁగా కనిపల్కవలదు
భక్తుఁడే యతఁడు దపఃఫలోన్నతిని - శక్తిమంతుఁడు గాక చర్చించిచూడ
భక్తులచేఁ బట్టువడుఁగాక శివుఁడు - భక్తిహీనుల [2]కేల పట్టిచ్చు శివుఁడు
విలసితభక్తి సద్విధి మెచ్చికాదె - యెలమి గుడ్డవ్వకు నెదురుగా వచ్చి
కదల కట్టుల చిక్కెఁగాదె సోమేశుఁ - డదియేల నావిందె గనుపురంబునను
గావునఁజూడంగఁగందు మిప్పురిని - దేవునిరాకకు దృష్ట మిచ్చటికి
పడిహారి భావనఁబఱతెంచె నతఁడు - నడర సౌరాష్ట్రనాయకుఁడ కానోపు
సకళనిష్కలభావ సన్నుతశక్తి - నిక మెట్టి పడిహారులకు నున్నదెట్లు
వచ్చెనిట్లానతియిచ్చె లోకులకు - నచ్చెరువుగ నెల్లి [3]యరుదెంచుఁజుండి
యిట యదృశ్యుండయ్యె నీశుండ” యనుచుఁ - గటకంబునరులు విఖ్యాతిసేయంగఁ
దవిలి సమ్మదసముద్భవవారి గ్రమ్మ - శివునియానతి లేఖ శిరమునఁదాల్చి
పుర మప్డు శుభముగా విరచింపఁబంపి - కరమనురక్తి బాచరసు వెండియును

  1. ముడుపు
  2. కెట్లు
  3. యరుదెంతునంచు, ని.