పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

181

వటమహీజాత మచ్చటనున్నఁజూచి - "యటుగాక దృష్ట మివ్వటముఁగాల్చెదవొ
పడసెదో చెప్పుమా భక్తుఁడ” యనిన - "మడియింపఁగూడదేఁబడసెద" నన్న
మంత్రతంత్రములచే మఱ్ఱిగాల్చినఁగు - మంత్ర కుతంత్ర కుమాయాపహారి
వసుధ నీఱైయున్న వటముపై నపుడు - భసితంబు సల్లి యెప్పటియట్లు నిలిపి
వఱలఁగఁ గోవూరివసదులన్నియును - జెఱుపఁడే బ్రహ్మయ్య సిగ్గేది జైన!

తేడర దాసయ్య కథ


మఱియును విను పొట్లచెఱు వనుపురిని - వఱలంగ నేణ్ణూరు వసదులు గట్టి
వెలయ ము న్నిరువదివేల్జినమునులు - గొలువఁగ జినకులగురుఁడొక్కరుండు
నా బల్లహునకు ముఖ్యాచార్యుఁడగుచుఁ - దా బుద్ధి సెప్పుచుఁదగఁబ్రబోధింప
క్షితిపతియైన [1]యా సింగబల్లహుని - యతివ సుగ్గలదేవి యకలంకచిత్త
తానును తేడరదాసయ్య వరద - యానూనసద్భక్తిమానస గాన
తమగురుస్వాములౌ దాసిదేవునకు - రమణి యాస్థితి విన్నపముసేసి హితులఁ
బుచ్చుడు నప్పు డప్పొట్లచెర్వునకు - నచ్చెరు వందంగ వచ్చునయ్యెడను
జినమును ల్వెక్కు గుచ్చితములు సేయఁ - గని నూఁకుచును లెక్కగొనకేఁగుదేర
నగ్గురు శ్రీచరణాంబుజంబులకు - సుగ్గలదేవి యుత్సుకలీల మ్రొక్కి
భామ గురుప్రసాదామృతాంభోధి - లో ముదంబారఁదేలుచు మునుంగుచును
వేఱొకఠావున విడియింప నతఁడు - మీఱివచ్చుట నటమీఁద నెట్లగునొ
యనివచ్చి జినమును ల్వినిపింప రాజు - జినసమయుఁడుగాన వనిత కిట్లనియె
“సతి కొక్కగతియును బతి కొక్కగతియు - నతివ! యేలోకంబునందైనఁగలదె
యెక్కడి గురువు[2]లు నేనాఁటిబుధులు - చక్కన నంపుము జైనులు విన్న
విపరీత మగు నింక వేయును నేల - చపలాక్షి! యనుపు మీసాముల” ననిన
నధికకోపోద్రిక్తయై "వీరిరాక - యధమజైనుల పెంపు లడఁపనె కాదె
పురుషునకు సతికిఁదెరు వొకఁడైన - గురుశిష్యులకు వేట తెరువులు గలవె
స్త్రీవివాహమునాఁడు సేసినబాస - నీవ విచారించుకో వేయునేల?
గడియించుకో భార్య గలదేని యోర్తు - విడువుము నన్ను నే మృడుఁగాని యొల్లఁ
గాదేని యోడింపు వేదశాస్త్రాది - వాదతర్కప్రతివాదంబులందు”
నంచు సుగ్గలదేవి మించిపల్కుడును - గుచ్చితులగు జైన [3]కూళలందఱును

  1. దే
  2. లిందేటివి
  3. గురులనం