పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

బసవపురాణము

బిలిపించి బల్లహుకొలువున వారి - వలపట నవరత్న కలితమై తనరు
సింహాసనాసీనుఁజేసి యాజైన - సంహారుఁడైనట్టి సద్గురుదేవు
దాసయ్యపాదము ల్డాసి యెత్తుచును - నా సుగ్గలవ యుండె నా జినమునులు
[1]మంత్రతంత్రానేకమాయాదులను గు - యంత్రమహేంద్రజాలాది విద్యలను
అద్వైతశూన్యమాయావాదకర్మ - విద్వేషమున [2]జైనవితతి దర్కింప
వేదవేదాంతాదివాద సిద్ధాంత - వాదతర్కముల సంపాదించి మించి
న్యాయవైశేషి కాద్యఖిలవాగ్దృష్ట - ధీయుతోక్తులఁబెక్కు దెఱఁగులు సూపి
“నద్వితీయుఁడు రామనాథుఁడే కర్త - సద్విధిసర్వము సర్వేశ్వరుండు
శ్రుతి "యేక ఏవ రుద్రో ” యనుతత్త్వ - గతి "లింగమధ్యే జగత్సర్వ” మనియు
రతి "లింగబాహ్యాత్పరం నాస్తి” యనియు - సతత మిట్టులు శ్రుతి చాటెడిఁగాన
యీక్షింప నింతయు నీశ్వరమయము - దక్షత గల్గెనా తర్కింపుఁ”డనిన
“నింకఁదర్కింపంగ నేది? యంతయును - శంకరుఁడనియెడు సచరాచరంబు
వలదుపో గుడి కేఁగి కొలిచెదమనఁగఁ - గలఁడంతటను గఱకంఠుఁడు మఱియు
నంగజహరుఁడు సచరాచరంబులకు - నంగమో జీవమో యాత్మయో చెపుమ”
యనిన [3]“శ్రమణులార! యాదిప్రశ్నకును - వినుఁడుత్తరంబ"ని వెండి యిట్లనియె
“నీరాష్ట్రములకెల్ల నీరాజుదక్క - ధారుణి మఱి చెప్పలే రనుటెల్ల
నోలి సమస్తపిపీలికాదులును - మాలలు బోయలు మహిపతి యనుటె
సర్వేశు [4]సుగుణవిచారితవృత్తి - సర్వంబునందును సంకీర్ణపదమె
యదిగాక వినుఁడీశ్వరాద్వైత మనుట - యిదియు సర్వాద్వైతమే యట్లుఁగాక
గుడికేఁగి మీకింకఁ గొలువనేలనిన - వెడఁగు ప్రశ్నకు మీరు వినుఁడుత్తరంబు
సర్వగతంబైన చంద్రాతపమున - సర్వశిలలు నుండఁజంద్రకాంతంబు
స్రవియించు నా రెంటిసామరస్యమున - స్రవియించునే యున్నశైలములెల్ల
శిలలపై వెన్నెల గలుగదే [5]కలిగి - ఫలమేమి యది ప్రాణపదముగా దట్లు
చంద్రికకొఱక తచ్చంద్రకాంతంబు - చంద్రాశ్మముకొఱక చంద్రిక యరయ
సర్వగతుండగు శర్వులోపలను - సర్వంబు నుండంగ శరణునిమనసు
కరఁగురెంటికి సమకళ [6]గల్గుఁగాన - కరఁగునే తక్కిన నరుల చిత్తములు
నఖిలంబు లింగమధ్యంబున లేదె - యఖిలంబు నుండియు నం దేమిఫలము

  1. యంత్రతంత్రార్థమాయావాదములఁగు
  2. నసద్వృత్తిఁదర్కింప
  3. కక్షప
  4. ఁడగుణ
  5. కలిమి
  6. గల్దు