పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

183

శరణునికొఱకె శంకరునిలీలయును - శరణునిహృదయంబు శంకరుకొఱక
మొదవుఁగ్రాపును దనయదియ కాఁదలఁచు - మొదవున కటె ప్రాణపదముగాక్రేపు
బ్రదుకుఁగాఁపును రెంటిపరిణామమంద - మొదవుగాఁపును నెఱుంగదు గ్రేపుఁగాని
మది లింగభక్తసన్మథనంబునంద - బ్రదుకు నెంతయుఁబ్రాణపథముగానుండు
స్వాతివాన గురియు జలములోనెల్ల - నేతఱి [1]గఱిఁగొన దిట్టిచిన్కులకె
కాని, నోర్దెఱవదు గఱి చిప్ప యొకటి - తానెల్ల వానలఁదడియుచు నుండు
నుభయసంగతిఁజేసి యుదయించు రత్న - మభవుని శరణుని యనువును నట్ల
కావున లింగభక్తస్నేహలీల - మీ వశంబె యెఱుంగఁగావలులార!
రమణమై నాడంబరమకాక లింగ - [2]సమధనసుఖములజాడ లేలింక
యంగమో జీవమో యాత్మయో యనిన - వెంగలిప్రశ్నకు వినుఁడుత్తరంబు
అంగంబు పూర్వకర్మావశేషంబు - నంగంబు సుఖదుఃఖసంగతినెలవు
నంగంబు పుణ్యపాపాలయం బట్టి - యంగంబు శివుఁడుగా దది వోవనిండు
జీవుఁడు శివుఁడని భావింతురేని - జీవుఁడు మలినుఁడు శివుఁడు నిర్మలుఁడు
జీవుఁడు దుష్కర్మి శివుఁడు నిష్కర్మి - జీవుఁడు సకళుఁడు శివుఁడు నిష్కళుఁడు
జీవుఁడు పశుమూర్తి శివుఁడు పశుపతి - జీవుఁడముక్తుండు శివుఁడు ముక్తుండు
జీవుఁడు సభవుండు శివుఁడభవుండు - జీవుఁడనిత్యుండు శివుఁడు నిత్యుండు
జీవుఁడశుద్ధుండు శివుఁడు శుద్ధుండు - జీవుఁడు మృతదుఃఖి శివుఁడమృతుండు
జీవుఁడు సంసారి శివుఁడసంసారి - జీవుఁడు సందేహి శివుఁడసందేహి
కావున, జీవుఁడు దేవుఁడు గాఁడు - పోవఁగ నిండది వొలుపుగా దింక
నాత్మయుఁబరమాత్మ యనరాదు వినుఁడు - ఆత్మ దాఁబంచభూతాత్మకంబయ్యు
నాత్మ దాఁబంచేంద్రియాత్మకంబయ్యు - నాత్మ దా దేహగుణాత్మకంబయ్యు
నుండుఁ గావున నాత్మయును గాఁడు శివుఁడ - ఖండిత సూక్ష్మవికస్వరలీల
సకలముఁగపటనాటకసూత్రములను - బ్రకటించు చైతన్యభావంబు శివుఁడు
అందు "నణోరణీయా” ననఁజొచ్చి - నందు లేకున్నట్టి శంభుఁడు శివుఁడు
నూవులలోపలి నూనియయట్ల - భావింపఁగాష్ఠంబుపావకునట్లు
పూనిపాషాణంబులో నిను మట్ల - తా నేత్రములలోని తద్రూపమట్ల
యలవడఁబాలలోపల నేయియట్ల - జలకుంభములలోని చంద్రునియట్ల
వెలుఁగు నద్దంబులోపలి నీడయట్ల - తలఁపఁబూసలలోని దారంబునట్ల

  1. గఱిగొన
  2. సుమ... జూడలేదింక