పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

బసవపురాణము

దన యేలుభూమి దాఁదక్కఁదక్కెల్ల - జినమార్గవర్తు లౌటను [1]నిషేధించి
మందునకైన భస్మత్రిపుండ్రాంగి - యెందును లేకున్న నెట్లొకో యనుచు
మది విచారించుచు మనుజేశుఁడుండఁ - దదవసరంబున మదనారిభక్తి
మానసుండగు శివజ్ఞానసంబంధి - నా నప్పు డా పాండ్యభూనాథుధరణి
కేతెంచి వీరమాహేశ్వరోద్యుక్తి - భాతిగాఁబ్రభవించి పరవాదులైన
జినమార్గవర్తుల నినుపకొఱ్ఱులను - గనలఁగఁదివియించె ననుచు నీవార్త
విని యట నిడుమారవిశ్వంభరేశుఁ - డనఘుడు దన దేశమున నెన్నఁబడ్డ
జినపదాచార్యుల జినమంత్రయుతుల - నననేల వీరు వా రనక రాఁబనిచి
“క్షితి నవాంతరశాస్త్రమతములు వన్ని - శ్రుతిబాహ్యులై చను మతిహీనులార!
పశుకర్ము నొకనరుఁబరమేశుఁడనుచుఁ - బశుపతి నెఱుఁగని పశుజీవులార!
పొసపరి శూన్య దుర్బోధలఁదగిలి - భసితం[2]బలందని పాతకులార!
అద్వైతకర్మమాయాకుయుక్తులను - సద్విధిఁజెందని చండాలురార !
అజ్ఞానబోధల కాలయం బగుచు - విజ్ఞానరతి లేని విద్వేషులార!
[3]యెట్టొకో నా ప్రజ నింతగాలంబు - బట్టి దుర్బోధలపాలు సేసితిరి
అటుచూడుఁడా యిప్పు డభవుసద్భక్తుఁ - డటె పిళ్లనాయినా రాపాండ్యభూమి
సర్వప్రమాణ దృష్టప్రత్యయములు - శర్వుఁడ కర్తగాఁ జనఁబ్రతిష్ఠించి
జినబౌద్ధసమయంబు లను పేళ్లు దుడిచి - మునులఁదివ్వించె నాయినుపకొఱ్ఱులను
గాన కొల్వుండు మా శ్రీనీలగళుని - గానినాఁడిందఱఁగ్రాఁగినకొర్ల
భువిఁదలక్రిందుగాఁదివియింతు” ననుచు - శివభక్తవర్యుఁడాశిష్టేశ్వరుండు
నిశితఖడ్గాయుధాన్వితహస్తుఁడగుచుఁ - బశువరింపుచుఁగొర్లపాలు సేయుచును
నంతలో శివభక్తులగు జినమునుల - సంతోషచిత్తుఁడై చనఁగాచెఁగాదె
నిడుమార భూనాథు మృడుభక్తిమహిమ - సడిసన్న లెఱుఁగవే జైనకష్టుండ!

నమినంది కథ


మఱియును నమినంది మా భక్తుఁడొకఁడు - వఱలుఁచెల్లత్తిరువాలూరిలోనఁ
దిరిగి యార్జించి [4]నే దెచ్చి భర్గునకుఁ - బరువడి వేయుదీపములు ముట్టించు
వ్రతతత్పరతఁబ్రీతి వర్తింపుచుండఁ - గుతగులై జైనులు గూడి యయ్యూర
భక్తుఁడొక్కఁడితనిఁబాఱఁగఁదోలు - యుక్తులెట్లని పెక్కులూహించి చూచి

  1. విశేషించి
  2. బుఁ బూయని పాపాత్ములార
  3. యెట్టకో
  4. నెయ్