పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

177

భువి సమస్తాంగము ల్వొందంగ మ్రొక్కి - యవసరోచితసత్క్రియాదు లొనర్ప
“జినమంత్రలేఖయు శివమంత్రలేఖ - యును నగ్నిలో వైవ నొగిఁగాలకున్న
వారిదె గెలు”పని వార్నుడువుడును - ధారుణీశ్వరుఁజూచి "దానఁదప్పేమి
పసిఁడితో నొకగుక్కపల్లు దూఁచుడును - బసిఁడియునెముకయుఁబ్రతివోల్పఁదగునె
పాలకావడి తూన్కి ఱాలఁ [1]దూన్చుడును - బాలును ఱాలును బ్రతియెతలంప
మలయజంబులు వట్టిమ్రాఁకులుఁ [2]దూన్ప - మలయజంబులు వట్టిమ్రాఁకులు సరియె
శివమంత్రలేఖయు జినమంత్రలేఖ - తవిలి కూర్చిన నేమి దత్తుల్య మగునె”
యంచును “శివ”యను నక్షరద్వయము - పంచవర్షాఢ్యుండు పత్రిక వ్రాయ
మండలాధీశుండు రెండు లేఖలును - మండెడు పెనుపగు మంటలో వైవఁ
గరమెత్తు నంతన సురసురఁగమరి - పరవాదిజినమంత్రపత్రంబు గాలె
హరమంత్రపత్ర మయ్యర్కునిఁగన్న - సరసిజదళమట్ల కర మొప్పియున్న
జినమునుల్తల సచ్చియును దోఁక సావ - కలరి “ముమ్మాటికి నరయఁగవలయు
శివమంత్రలేఖయు జినమంత్రలేఖ - తవిలి కావేరిమధ్యంబున వైవ
నేటఁబోయినపత్ర మోటపత్రంబు - నేటికి నెదురెక్కుడిది నిజం” బనినఁ
“బిడికిటఁగోమటిఁబొడువంగమఱియుఁ - బొడువుమా యనుక్రియఁబోవంగరాదు
ఊరక పోనీకు మోడినవారి - ధారుణిజనులెల్లఁ దల లెత్తిచూడ
నెఱ్ఱఁగాఁగాల్పించి యిచ్చట నినుప - కొఱ్ఱులఁ [3]దివియింపు కువలయేశ్వరుఁడ!”
యనవుడు నవుఁగాకయని జినమునులు - జనపతియును దారుఁజనుదెంచి యంత
నాకులు కావేరియందు వైచుడును - జేకొన నెదురెక్కె శివమంత్రలేఖ
వారి మంత్రం బాకు వఱదనే కలసెఁ - బూరించునే చమత్కారమంత్రములు
అంత నా పిళ్లనైనారు భూనాథు - సంతోష మలరార సద్భక్తుఁజేసి
పదునెనిమిదివేలు మొదలిజైనులను - బొదిగొని పిలిపించి పొరిఁబొరిఁబట్టి
యచ్చెరువందఁగులచ్చిరియారు - చెచ్చెర నటమున్న చేయించినట్టి
కాలియున్న యినుపశూలంబునందు - నోలిఁ [4]దివ్వించుచు వ్రాలి యిద్ధరిణిఁ
బరగఁగ దిరువూరఁబఱపుట వినవె - యురుభక్తియుక్తిమై నోరి జైనుండ!

నిడుమారని కథ


పుడమినట్టులు సెప్పఁబడియె వెండియును - నిడుమారఁడనునొక్కనిఖిలేశ్వరుండు

  1. బూన్చు
  2. బూన్ప
  3. దీయింపు
  4. దీపిం