పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

163

“గుడికడ [1] నెన్నటఁగోలె నున్నదియొ? - పడికి [2] వల్చెడుఁజేరి పట్టరా” దనుచుఁ
దార యాకృతకంపుఁదపసిశవంబుఁ - జేరి విమానంబుఁజేర్చి సంధించి
జగదభినుతుఁడగు చౌడయ్యగారి - నగరిపొంతను విమానంబు రాఁబనిచి
యల్లంత నల్లంత నపహసింపుచును - గల్లరిలోకులగము లేఁగుదేర
నడతెంచు నవ్విమానంబులో శవముఁ - బొడఁగని చౌడయ్య గడుదూరమంద
కృతకంపుశవముగా మతిలోన నెఱిఁగి - యతిదరహసితాస్యుఁడగుచు నుప్పొంగి
“యవికలాజాండంబు లలిగినఁజెఱుపఁ - దవిలి కూర్చినఁగావ దక్షులైనట్టి
మదనారి భక్తులమహిమఁదలంప - నిది యెంత పెద్ద దా నీరూపమునకుఁ
బడయుదు నొడలును బ్రాణంబు”ననుచు - మృడభక్తమండలియడుగులు దలఁచి
వడిగొని డగ్గఱి వాలార్చి [3]చూచి - విడిసేసి గాయంబు గడుమొనసూపి
యందుండి [4]లంఘించి యావిమానంబు - నందున్నకృతకాంగు హస్తంబు వట్టి
గ్రమ్మనఁ "దపసి లే లె”మ్మని పిలువ - నమ్మాత్రలోన జీవాంగుఁడై లేచి
ముసిఁడిచౌడయకంటె ముందఱ నిలిచి - వసుధపైఁదజ్జనావలి సోద్యమందఁ
జవుడయ్యగారి శ్రీచరణాబ్జములకుఁ - దవలి సాష్టాంగుఁడై తా మ్రొక్కి నిలిచి
“హరుఁడవు నీవ సద్గురుఁడవు నీవ - కరుణింపు మీ పాదుకాతతి మోవ
ఖ్యాతిగా భవదీయకారుణ్యగర్భ - జాతుండ నన్యధా [5]నీతు లెఱుంగ”
నంచుఁబ్రార్ధనసేయు నాతని నపుడ - సంచితగురులింగ సంగతుఁజేసి
యతుల కోపోద్రిక్తుఁడై కసిమసఁగి - కృతకులఁదునుమంగ మతిఁదలంచుడును
బరవాదు లతిభయభ్రాంతాత్ము లగుచు - నరుదెంచి యంతంత ధరఁజాఁగిమ్రొక్కి
“యసమాన ముసిఁడిచౌడాచార్యవర్య! - దెసయును దిక్కును దేవ! యేడ్గడయు
నీవ మా కన్యథాభావంబు లేదు - కావవే యజ్ఞానజీవుల శరుల
సకలాపరాధుల సైరించి మమ్ము - సుకృతవంతులఁజేయు సుజనాగ్రగణ్య!”
యని విన్నవించుచు నభయంబు వేఁడ - ఘనకృపామతి నార్తజనశరణ్యుండు
సజ్జనశ్రేష్ఠుండు సౌడరాయండు - నజ్జనానీక మత్యర్థిఁ గీర్తింప
గతపూర్వలాంఛనాకృతులఁగావించి - యతులిత శివసమయస్థులఁజేసి
యసదృశలీల నమ్ముసిఁడిచౌడయ్య - వసుధ నెప్పటియట్ల వర్తించుచుండె

  1. నిన్నటఁ (గూలియు)...యు
  2. యువచ్చెడిఁ, వ్రేసెడిఁజేరి ఇచట “వినరాని శబ్దంబు వినఁగఁ బాడుచును,
    ఘనవిష్ణునామంబు గణుతించి చదువ” అని యొక్క ప్రతియందుఁగలదు.
  3. విడిని, దిగిచి
  4. జళిపించి
  5. రీతు