పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

బసవపురాణము

'నెనయ దీవించువా రేండ్లేల యిత్తు' - రనుపలు కప్పుడ యాలంబు గాఁగ
నిశితఖడ్గం బార్చి నిఖిలంబు నెఱుఁగ - 'శిశువ! లె'మ్మని పేరఁజీరఁగఁదడవ
[1]కట్టులు వటు కనఁగాఁదెగినిద్ర - బిట్టుల్కి తెప్పిఱినట్టును బోలె
నతిసంభ్రమాక్రాంతమతిఁదేఱిచూచి - యతివ సౌడయ్యకు సాష్టాంగ మెరఁగె
తల్లియుఁదండ్రియుఁదమపుత్రితోన - యుల్లంబు దళుకొత్త నొగిఁజాల మ్రొక్కి
ముసిఁడిచౌడాచార్య! యసమానశౌర్య - వసమె నీ గరిమంబు వర్ణింపఁదలఁపఁ
బ్రాణోపకారికిఁబ్రత్యుపకార - మేణాంకధ [2]రమూర్తి యిలఁజేయఁగలదె?
దాసులఁగా మమ్ము దయ నుద్ధరింపు - మీ సంసరణవార్థి [3]యింకఁదోఁపంగ”
నంచు విన్నప మాచరించుడు మువుర - నంచితప్రాణలింగాంగులఁజేసి
గతవత్సరంబులు గాక మూవురకు - శతవత్సరాయు వాయతిఁగరుణింపఁ
“బ్రాణదానముసేయఁబరులవశంబె? - ఏణాంకధరునకు నిల నరు[4]దన్న
జా నొందఁగ మసిఁడిచౌడయ్య ప్రాణ - దానంబుసేసెఁజిత్రము సిత్ర” మనుచు
మ్రొక్కుచు లోకంబు వెక్కసపడఁగ - నెక్కుడుకీర్తికి నెల్లయై యంత
మహనీయసద్భక్తిమహిమ దుల్కాడ - సహజైకలింగి యాచౌడయ్య నడవ
నతని మహాద్భుతోన్నతిఁ జూడఁజాల - కతిమతిహీనులై యన్యదర్శనులు
“తొడ [5]సూడుపోతుల జడలతమ్మళ్లఁ - బడయుఁదానటె చూ సబంబులఁగన్నఁ
జవుడయ్య గారలచందంబు సూత - మవుఁగాక తప్పేమి” యనుచు దుర్బుద్ధి
గోనెగర్భం బిడి మానిసి రూపు - దా నిల్పి [6]బూడిది దళముగాఁబూసి
యన్నిగందువల రుద్రాక్షము ల్వూన్చి - జన్నిదంబులు వెట్టి జడలను బెట్టి
యడిపొత్తి సించి కచ్చడము సంధించి - కడపట నొకనాడు గుడికడ వైచి
యింతట నంతట నెఱుఁగని యట్ల - సంతల నిలిచి దూషకులు సెలంగ
“నక్కటా! గుడికడ [7]నదియొక్కదపసి - దిక్కుమాలినపీన్గు ద్రెళ్లి యున్నదియు
కుడువఁగట్ట విడువ ముడువలేదనియయొ! - బడుగుఁబీనుఁగుగాన భక్తులు రారు
ఎల్లవారికిఁబ్రాణమేమి నిత్యంబు? - చెల్లఁబో! యెవ్వరుఁజేర రియ్యెడకు
నెట్టు సూడఁగవచ్చు నింక ధర్మంపు - గట్టియయైనను [8]బెట్టుదం” డనుచు
దమ్మళ్లఁ గొందఱఁదపసులఁబిలిచి - గ్రమ్మన నొకవిమానమ్ముఁగల్పించి

  1. కట్టినకట్లప్డు చట్టనఁ దెగఁగ - బిట్టుల్కి నిద్రఁ దెప్పిఱినట్లు వొరలి
  2. రునకు నిలనరు దయ్య
  3. యినుక
  4. దెన్న
  5. తొడఁగూడC(డుపో)టో (తోడుగూడుపో?)
  6. బూడిదె
  7. నదె
  8. బెట్టుదమ