పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

161

వెడ[1]వాఁగయేమని వెల్లిసూపెదవు - అడఁగుము ద్రోవయి” మ్మనుచుఁజౌడయ్య
అలుఁగుమోహణమున హస్తంబు దొడిగి - జళిపింప నీరెల్లఁజల్లనఁబాసి
నీరిపర్వత మన నింగి నుప్పొంగి - తారాపథంబునఁదా నిట్టవొడిచె
నాకాశగంగచే హరుభక్తమహిమ - నేకాంతమున విన నేఁగినయట్లు
[2]అయ్యేఱు ముసిఁడిచౌడయ్యకు వెఱచి - చయ్యన నేఁగె రసాతలంబునకు
నన్నట్లు త్రోవ నీ రఱిముఱిఁబఱవ - మిన్నక నడుమెల్లఁదిన్నెలై యుండ
“రండు రండిపుడు [3]నీరము నడు మడువ - రెండు గా వనుమాట రిత్తయ్యె” ననుచు
ముసిఁడి చౌడయగారు ముందఱ నడవ - నసమభక్తానీక మానందలీల
నంతంత నిలుచుచు నార్చుచుఁ గుప్పి - గంతులువైచుచు గతికి నిల్చుచును
నెడనెడ నార్చుచుఁబెడబొబ్బ లిడుచు - వడిఁబిల్లమెఱములు వైచుచు లేచి
పరువులు వెట్టుచు నరుగ ముందఱను - నరుదారఁదపసియు నాఁబోతు నడవ
దరహసితోల్లాసవరవక్త్రుఁడగుచు - నరిగెఁజౌడయ్య దా నద్దరి నిలిచి
“పెల్లున లోకంబు [4]లెల్లను ముంప - గొల్లన నడచు నీ త్రుళ్లెల్ల నడఁగె"
ననుచు నమ్ముసిఁడిచౌడయ్య సద్భక్త - జనసహితంబుగా ననురాగలీల
నరిగి యొప్పారఁదత్పరిణయక్రియలు - పరితోషమతి [5]సమాప్తంబు గావించి
బగుతు లెదుర్కొన మగిడి కల్యాణ - నగరంబు వీథుల నడతెంచుచుండఁ
దపసియు నాఁబోతుఁదనతోడ నడవ - విపరీత మతి నరు ల్విభ్రాంతిఁబొంద
జయజయధ్వను లాకసము నిండి చెలఁగ - రయమునఁబఱతెంచి రమణి యొకర్తు
భావించి చౌడయ్యపాదము ల్నొసలు - మోపంగ ధరఁజాఁగి మ్రొక్కినఁజూచి
యనునయం బొదవ “శతాయుష్య” మనుచుఁ - జనుదెంచి [6]తమనిజస్థానదేశమున
దొల్లింటియట్ల యద్భుతలీల నుండ - నల్లకన్యక మృతమైన మర్నాఁడు
జనకాదు లేడ్చుచుఁగొని వచ్చివచ్చి - కనుఁగొని చౌడయ్యగారికి మ్రొక్కి
“నిన్న మీ పాదముల్ నెన్నుదు రిఱియ - సన్నుతి మ్రొక్కిన సతి నేఁడు సచ్చె
నీ దీవనయుఁదప్పునే” యని వారు పాదము ల్విడువక పలవరింపంగఁ
[7]'దొలదొలఁ'[8]డనుచును 'ద్రోవ కడ్డంబు - నిలిచి వాచర్వక నిలునిలుఁ’ డనుచుఁ
గంపరం బవనిపై దింపించి మహిమ వొంపిరిగొన నోరవోవఁదట్టుచును

  1. వ్రంత యిదియేల వెల్లిసూపఁగను
  2. అయ్యెడ
  3. నీర్నడుమవ్రేసినను
  4. లుల్లడి (డింపంగ)
  5. జేసి బహుమాన మెసఁగ
  6. తన
  7. దొలఁగుఁడటంచును
  8. మనుచునాత్రో