పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

బసవపురాణము

నటమున్న నంది [1]పాఁతదరి యద్ధరణి - పటపటఁబగులంగ వటవిటపంబు
చట్టన వ్రేళ్లతోఁజటచటఁమనఁగ - గట్టెగసల్లంత మిట్టిపడంగ
నందఱు నతివిస్మయాక్రాంతులుగను - నందుండి [2]యూఁకించి యవనికి నుఱికి
నిలిచి [3]నిట్రించి ఘణిల్ఘల్లనఁగ - నలరుచు ఱంకె లందంద వైచుచును
వాల మల్లార్చుచుఁ గాలఁద్రవ్వుచును - నేలఁగోరాడుచు నీడ కుర్కుచును
నుడువీథి కెగయుచు నొడలు వెంపుచును - వడిగొని పఱచుచు [4]నిడుజంగ లిడుచుఁ
దగిలి గద్దించుచుఁ దలఁకుచు మూతి - యిగిలించికొని మొగంబెత్తిచూచుచును
జిఱుపెండవెట్టుచుఁజిఱలు వొడ్చుచును - గుఱుజంగలిడుచు దిక్కులుసూచికొనుచు
గెలఁకులఁదన్నుచుఁ గ్రేళ్లువాఱుచును - [5]బులుగఱ చుమియుచుఁ మలఁగినాకుచును
బోరన నెగయుచుఁబొంగుచుఁగొమ్ము - లోరగించుచు మలయుచు వంగికొనుచు
నూఁకరల్వెట్టుచు నురవడింపుచును - మూఁకకు నెగయుచు ముస్సు ముస్సనుచుఁ
జవుడయ్యఁజూచుచు సంతసిల్లుచును - దవులంబు సేయుచుఁదపసి వెన్కొనుచు
బాసికంబును నాఁటి పసపుటక్షతలు - నా సమంచిత సుగంధానులేపనము
లొనరంగ వింతచెన్నొలయంగ గంట – లును మువ్వలును గజ్జెలును మ్రోయుచుండ
నంతంతఁదనరారి యాలఱేఁ డుండ - సంతోషమున ముస్డిచౌడరాయండు
బడిసివైచుచుఁజేరి మెడఁగౌఁగిలించి - యడుగులు గడిగి పుష్పాంజలు లిచ్చి
యాయతధూపదీపాదు లొనర్చి - నేయుఁబాలును బొట్టనిండ వడ్డించి
“నడవుము నడవుము [6]నందెన్న! నీవు - నడవ కేఁబెండ్లికి నడవ [7]నిక్కంబు”
అనవుడు లోకంబు లచ్చెరువంది - వినుతింపఁదద్భక్తజను లుత్సహింప
నందఱ ముందఱ నరుగు నత్తపసి - ముందట నాఁబోతు మురియుచు నడవ
[8]నరుగఁగ నరుగఁగ నంత ముందఱను - నురవడి నుప్పొంగి యుడువీథి దాఁకి
హిద్దొర యనునది యిల నిండిపాఱఁ - దద్దయు నుద్వృత్తి ధరఁదన్ని నిలిచి
“ఎఱుఁగవే వారాసు లెల్ల నొక్కయ్య - యఱచేతిలోనన యణఁగుట మఱియు
భవి పుట్టి యెల్లక భువి ముదలింప - సవిశేషభక్తప్రసాది దాసయ్య
కాదె నిన్ బోకార్చి కాల్నడయంద - యీ దేశమంతయు నెఱుఁగంగ దాఁటె
మఱియు గజ్జేశ్వరుమసణయ్య దన్ను - మఱచి శివార్చనామగ్నుఁడై నడుమ
నుండఁ బై రానోడి రెండు దిక్కులను - ఖండితంబై నీవకావె పాఱితివి?

  1. పోత
  2. యంకించి
  3. దృష్టించి
  4. వటము మూర్కొనుచు
  5. పులుగఱనైచుచు
  6. నందెన్న' అనియే కలదు
  7. నీయాన
  8. నందఱి