పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

129

అతుల మహోద్ధతాయత మహాభక్త - తతి యల్గెనేఁగావఁదరమె యీశునకు?
కడుఁగడు గర్వియై కానఁడాతనిని - గుడివెడలింపుఁడు గూడదు చూడ”
ననవుడు విన్నవారాశ్చర్యమందఁ - జనుదెంచి యొక్క వూజారి గేల్మొగిచి
“దేవ! మున్నెఱుఁగవే? యీ వాలుమీక - దేవదేవుఁడ లసత్ప్రీతిదుల్కాడ
నచ్చెరువంద నీ యయ్యపాటలకు - మెచ్చియో భక్తికి మెచ్చియో యెఱుఁగఁ
బడి నిత్యవేమాడ లెడపక యిచ్చు - నడిగిన వెండియుఁగడపఁడేమియును
గొడుకని మన్నించుఁ గడుముద్దు సేయు - నెడవోవు లంజియయింటికిఁ దాన
యనురాగహేతు సర్వార్థసంపదలఁ - దనిపి నంబికి విటత్వంబు సెల్లించు
నిల విదూషకుభాతి నిరువురవలపు - లలర నన్యోన్యగుణాంకన ల్సేయుఁ
గ మర్ధిఁ దాన నాగరకునట్లతని - సరసోచితాలాప సంపదఁదనుపు
ధరఁదాన పీఠమర్దకులీల నెల్ల - పరిచర్యలును బడిపనులును జేయు
నన్నియు నననేల నమ్ముడువోయి - యున్నాఁడు శివుఁడు నం బెన్నకు” ననిన
“నీతఁడా నంబి? ము న్నితనికా శివుఁడు - ప్రీతితోఁబడివెట్టుఁ? బెద్దమేలయ్యె
నీతని బగితియు నితనికిఁగూర్చు - నాతనికూరిమిఁజూతఁడి”ట్లనుచు
“నంబియు గింబియు నంబికిఁగూర్చు - సంబుండు గింబుండు సకల భక్తులకు
వెలియుఁజుండో” యని వ్రేయించె ఘంట - నలిరేఁగి మిఱుమిండనల్లనైనారు
అట యున్నవారెల్ల నక్కజంబంద - "నిటయున్కి [1]పాటిగాదింక రం” డనుడు
ముఖమంటపంబున మును గొలువున్న - యఖిలభక్తులయాగ్రహంబు నాలించి
భయభక్తియుక్తియు భక్తైకదేహ - తయు నంబికెఱిఁగింపఁదలఁచి శంకరుఁడు

వాల్మీకేశుఁడు సాకారుఁడై మిఱుమిండనికి వెఱచి యొడయనంబితో చాటుగాఁబాఱిపోవుట


నయ్యా! యనుడు నేమియయ్యా! యనెడుత - దియ్య(?) వాక్యంబు నజ్జియ్య యడంచి
గ్రక్కునఁజేసన్నఁ గదియంగఁబిలిచి - చక్కన సాకారసన్మూర్తిఁదాల్చి
వడవడవడఁకుచు వాల్మీకదేవుఁ - దొడయనంబిని దన పెడకచ్చఁ [2]జక్కఁ
బట్టించుకొనుచు సద్భక్తసమూహి - కట్టెదురఁజనంగ గడుభయమంది
చప్పుడు గాకుండ జలహారి దెసకు - నప్పుడ తొలఁగి యొయ్యన నడ్గులిడుచు

  1. పాడి
  2. జంకఁ