పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

బసవపురాణము

[1]మదుకుచు దీపముల్ మఱుఁగు వెట్టుచును - నొదుఁగుచు మూలల కోసరించుచును
గాలిసన్నడఁపుచుఁగరముల గోడ - ఱాలూఁదికొనుచును ల్వాలించుకొన్చు
లాలిత నవపుష్పమాలావిలంబి - కీలనపంక్తుల క్రేవలఁదారి
[2]తలఁకున డెందంబు తటతట [3]నుదర - [4]నలఁగుచు గర్భగృహాంతంబు వెడలి
మెల్లనమెల్లన మెట్టుచుఁ దొలఁగి - యల్లనల్లనఁదల్పులండకుఁ జేరి
సంగతి జాలక సమతులఁదొంగి - తొంగిచూచుచు నెడఁదొలఁగి నిల్చుచును
బోవకుండఁగ నోడి పోవంగనోడి - యావాలుమీకేశుఁడాత్మగలంగ
సందులు వ్రిదుల సంచలనంబు వొడల - సందడిదొఱఁగి పూజారుల మొఱఁగి
ఘనభక్త నిచయంబుఁగనుఁగొన వెఱచు - చనుగరాగ్రములు దృష్టులకడ్డమిడుచు
స్రుక్కుచు సరగున సొకనాసి వెడలి - చక్కనగుడి వెన్కదిక్కున కరిగి
యెగురుదురో(?) యని వగవంగ వెనుక - [5]మగిడి యాలించుచు బెగడుచుఁజనుచుఁ
జొక్కాకుగాలికి స్రుక్కుచునిక్కి - నిక్కిచూచుచు నలుదిక్కులరయుచుఁ
[6]జెంగి చెంగి చనుచుఁబొంగఱి వంగి - వంగిపాఱుచుఁ దొంగితొంగి తాఱుచును
నటమున్న కలుకోట యందొక్కఱాయి - స్ఫుటపదాంగుళమున భువిఁబడనూఁకి
కడుభయంబున గండికను దూఱివెడలి - వడిగొని కుఱుజంగ నిడుజంగ [7]గునుకు
పరువు బాటయఁబెట్టి పఱవ ముందటను - ధరనొప్పి క్రోశ మాత్రంబున నొక్క
వరవిచిత్రోద్యానవన మున్నఁజూచి - యరుగక దిగ్భ్రమితాత్ముఁడై నిలిచి
“యూరోయిది యటంచు నూరుగా దురుత - రారణ్యమో యూరు నడవియుఁగాదు
హృద్యశాఖాతతి నిత్తరులొప్పు - నుద్యానవనముగా నోపు నీ వనము
గానిమ్మిదియు నూరుగాకున్నఁజాలుఁ - గాని ఘోరాటవియైన నుద్యాన
వనమైన ననుచు నల్లన వనాంతరము - చనఁజొచ్చి తొంటి తెర్వునకుఁ దొలంగి
మూఁక చింతలవడి మోకమామిళ్ల - వాఁక నొప్పెడు సరోవరము నీక్షించి
పారిజాత వకుళ బంధూక కర్ణి - కార క్రముక కోవిదారముల్గడచి
చందన ఘనసార చంపకాశోక - మందార తరువుల కందువదాఁటి
యిమ్ముల మాదిఫలమ్ముల కురవ - కమ్ముల నారికేళమ్ముల క్రేవ
మాగధీ కరవీర మాలతీ కుంద - నాగకేసర వికీర్ణస్థలి నడుమ

  1. ఈ రెండు ద్విపదలు గొన్ని ప్రతులలో లేవు.
  2. తలఁగు
  3. నదర
  4. నలుకును
  5. మగుడి
  6. జంగిచంగి
  7. లిడుచు