పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

బసవపురాణము

నెట్టన శరణుల నిలుకడ లరసి - పట్టిచూడంగ నీ ప్రాప్తియే చెపుమ
మృడుఁడు ప్రసన్నుఁడై యడు గడుగుమన - [1]నడిగెనే గెలిగొని యడకించెఁగాక
[2]యదియేల చేయుకాయకలబ్ధి యెంత? - కదలకయుండు జంగమసంఖ్య యెంత?
యక్కజంబైన కాయకలబ్ధి నిత్య - మెక్కవు దఱఁగవు నేను మానికలు
జంగమకోటుల సంతుష్టిసేయు - లింగసదర్థుల లేమి యెట్టిదియొ?

ఈశ్వరుఁడు శంకరదాసికి మూఁడవకన్ను నిచ్చిన కథ


ఖండేందుధరుఁడు లోకత్రయంబునను - వెండియు నాయయ్య వెలయింపఁదలఁచి
'యడుగు'మటంచుఁ బ్రత్యక్షమై నిలువఁ - జిడిముడిపడక సంస్మితవక్త్రుఁడగుచుఁ
గర్తలకర్త మత్కర్తవై నీవు - వర్తింప నింకొండు వరమేల వేఁడ
కడుఁగాక యేమియు నడుగమి సిగ్గు - వడియెద వడిగెదఁ బగలింటియట్ల
రాత్రియు సూఁదిదారంబు గ్రువ్వంగ - నేత్రములకు దృష్టి నెక్కొల్పుమనుడు”
వరదుండు దరహాసవదనాబ్జుఁ డగుచుఁ - గరమర్థి మిక్కిలికన్నిచ్చుటయును
హరునిచేఁ బడసిన యామీఁదికన్ను -పరదైవ దోర్దర్పహరణార్థమగుట
శంకరదాసి నిశ్శంకితవృత్తి - శంకరేతర సర్వ సమయారి యగుట
నిటలతటాంబకోత్కట చటులాగ్ని - పటు దృష్టివాతను బలువేల్పులెల్లఁ
జిటచిటఁ బ్రేలుచుఁ జటచటఁ బాసి - పటపటఁ బగులఁగఁ గటకటాయనక
వేల్పన్న పేరికి వెనుకొని [3]పుట్టు - మాల్పఁగ మఱికొన్ని వేల్పులు వోయి
బలువిడి శివ[4]శరణుల మర్వు సొచ్చి - తలఁకుచు మ్రొక్కు వేల్పులనెల్లఁ గాచి
యనయము మువ్వెట్టి గొనుచును [5]బడుగు - పనులు వంపఁగఁజేసి బ్రదుకుదమనుచు
[6]మసనక ముంగిటికసువులు నూక - [7]కొసనక మానక కొట్నంబు దినముఁ
బుట్టెఁడు దంపంగఁ బోలక మఠము - చుట్టును జాల రాఁజుచునుండు పెద్ద
పోటికట్టెలు వొలమున మోచితేరఁ - గాటిపాపఁడు వసిఁ గాచుచునుండఁ
గడుభక్తితోఁ గటకంబు మైలారుఁ - డడర నెప్పుడు గొడ గిడి తోడ నడవ
జేరి యాకడమల [8]చేటికాట్రేఁడు - దారలువట్ట నుద్యత్కీర్తులులియఁ
దక్కిన [9]యా పెఱదైవంబులెల్ల - నొక్కటఁ బనులు సేయుచుఁ గొల్చియుండ

  1. యడిగెనేగేలిగోన
  2. యదియేమిసే, యదియెల్లఁ జే
  3. పట్టు
  4. భారువుల
  5. బడగు?
  6. మసలకు
  7. కొసరక, మారక
  8. జెట్టికాట్రేఁడు
  9. బెంతర, జంతర