పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

113

నొప్పి యష్టాదశయోగపీఠములు - దప్పక [1]యేఁటేఁటఁ గప్పంబు [2]లరువ
'ముక్కంటి! నీ యింటికుక్కల'మనుచు - జక్కులు గిక్కులు మ్రొక్కుచుఁ గొలువఁ
దగిలి వారలమహత్త్వము విని యంత - జగదేకమల్లఁ డసహ్యభావమున

జగదేకమల్లని కథ


హరి నడంచుటయొ బ్రహ్మాదిదేవతలఁ - బొరిమాల్చుటయొ బుడిబుడి వేలుపులను
[3]బఱచుట సోద్యమే కఱకంఠుచేత - నెఱయ ఫాలాభీలనేత్రంబు వడసి
ముక్కన్ను వడయు(వాఁడౌ?)ట నిక్కమేనియును - జక్కన విష్ణుని సమదృష్టినిలిచి
వేయేల వడఁకక పోయినఁజాలుఁ బో!” యని కల్యాణపురమధ్యమందు
గోవిందుప్రతిమ యుక్కునను గావించి - భావించి యటమీఁదఁ బంచలోహములుఁ
బోయించి కడుసాంగముగఁ బ్రతిష్ఠించి - పాయక రేయును బగలును గొలువ
శంకరదాసి యచ్చటి కేఁగుదెంచి - యంక కాఁడునుబోలె హరభక్తులలర
నఱిముఱి మొగవాడ దెఱచి వీక్షింపఁ - బఱియలై విష్ణునిప్రతిమ నుగ్గగుడు
నట[4]మున్న మీఁదిలోహంబెల్లం గరఁగి - యిట వాదములఁబడ నేతెంచినట్టు
లరుదేర విష్ణునిఁ [5]బొరిమాల్చెఁగూలఁ- బరసమయులు భయభ్రాంతులై [6]పఱవఁ
గట్టుగ్రలీల శంకరదాసమయ్య - యిట్టు వర్తింపంగ నిల నరుల్వొగడ
నెఱుఁగవే విని చూచి యేఁజెప్పనేల - కఱకంఠునకునైనఁ గావ శక్యంబె?
భక్తులసద్గోష్ఠిఁ బాసియుండినను - భక్తియు భయమును బాటిల్లుఁగాక
భక్తులసద్గోష్ఠిఁ బాసియుండినను - భక్తియు భయమును బఱపఱగాదె!
ఇదియేమి సోద్యమో యీశుఁడే యెఱుఁగు - విదితంబుగా మఱి చదువఁబెట్టినను
గలమతియును జెడ్డకారణంబయ్యె - నిల నిన్నియును జెప్పనేల? ర”మ్మనుచు
వందుచుఁ గుందుచు [7]వనట నిర్వురును - నందంద సాష్టాంగులగుచు నేతెంచి

దుగ్గళవ్వయు దేడరదాసియు శంకరదాసయ్యను మన్నింపవేఁడుట


“కావవే జియ్య! శంకరదాసమయ్య! - దేవ! దెసయు దిక్కు నీవ మా”కనుచు
మ్రొక్కుచుఁ గరములు మోడ్చినఁ జూచి - "యక్కటా! వీరెవ్వరయ్య [8]వోచెల్ల!
దాసిదేవయ్యగారా! [9]సరణార్తి - మీ సరివారమా? మీకిట్లు దగునె?
ఇట విజయంచేయు టేమికార్యంబొ? - [10]ఎటపయనం బిట్టు లేఁగుచున్నారొ?

  1. యేఁడేఁట
  2. లిడుచు
  3. బఱపుట
  4. యున్న
  5. బరిమార్చె
  6. పర్వ
  7. వడినిరువురుమ
  8. రోచెల్ల
  9. శరణార్థి
  10. ఎటకైనఁబయనమైయేఁ