పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

111

మాచయ్య బసవన్నకు శంకరదాసికథఁ జెప్పుట

జడయ శంకరమహాస్థానంబునందు - సడిసన్న శరణుండు శంకరదాసి
కాలకర్మాకర్మకలితమహేంద్ర - జాలవిలోలనిర్మూలనశాలి
జన్మజరామరణోన్మదాపహుఁడు - చిన్మయానందవశీకృతాత్మకుఁడు
రౌద్రమహోద్రేకరంజితవీర - భద్రుండు ప్రత్యక్ష ఫాలలోచనుఁడు
దండితాజాండ కరండదోర్దండ - మండితాడంబరతాండవమూర్తి
విలసితకీర్తి నిర్మలుఁడు సంసార - తలగుండుగండఁ డతర్క్యప్రతాపి
నాఁగఁ బ్రఖ్యాపితానశ్వరలీల - వీఁగుచుఁ బ్రచ్ఛన్నవేషంబునందు
బొంతకు గంతకుఁ బ్రోవిడి పోవు - నంతకు విక్రయంబార్చి తెప్పించి
యక్కజంబందఁ గాయకలబ్ధి [1]నిత్య - మెక్కవుఁ దఱుఁగవు [2]నేను మానికలు
జంగమకోట్లకు సముచితార్చనలు - భంగిగాఁ జలుపుచుఁ బ్రభుడున్నయెడను
దేడరదాసయ్య సూడంగ వచ్చి - వేడుక మదిఁ [3]దులుకాడంగ మ్రొక్కి
యొక్కింత సుఖగోష్ఠి నుండి వీడ్కొనుచుఁ - జక్కన మఠమేఁగి [4]సదయుఁడపోలెఁ
“గటకటా! యింతలింగ [5]సదర్థుఁడయ్యు - నిట యీఁగకును దవుడింటిలో లేదు
శంకరదాసి లసద్భక్తి మహిమ - మింకనెన్నటి కంచు నె[6]డ్డవగచుచు
నక్కటికను దుగ్గళవ్వకుఁ జెప్పి - చిక్క గంపెఁడుకొల్చు శ్రీఘ్రంబ పనుప
“నట్టట్టె! పుత్తెంచెనటె కొల్చుదాసి - యట్టిదకాక మేలయ్యె నెంతయును
గొలుచునకిచ్చె మున్కోకయుఁ జించి - యిల నేమియడుగునో యీ మాకుఁగలదె?
బిడికిట నొకమాటు వుడుకంగఁదడవ - పిడికిటిలోననే యడఁగె గంపెఁడును
[7]నత్తవనిధియును నందలయించెఁ - దొత్తడిసంపద దొలఁగెఁ దత్క్షణమ
కూడు మందునకైనఁ గొలు [8]చిన్నిలేక - యాడకాడకు గాదియలు వాడువాఱె
దాసి మువ్వడసినతవనిధి యట్లు - దాసయ్య దివుచుడుఁ దత్‌క్షణమాత్ర
పరిభవాద్భుతశోక పారవశ్యమున - దురపిల్లు దాసికి దుగ్గళవ్వనియె

దుగ్గళవ్వ దేడరదాసయ్యకు శంకరదాసిమహిమ చెప్పుట


"కలవానియట్ల నిక్కంబు నీ వొక్క - బులుసరితనమునఁ బుచ్చితి కొలుచుఁ
దనర నేనుఁగుపండ్లు దాఁబట్టిచూచు - మనుజుండు బ్రదుకునే మడియునకాక

  1. నిక్క
  2. నేడు
  3. దొలు
  4. పథనుండ
  5. సమర్థుఁ
  6. నుదవగచుచును, నెడ్డవగుచుచును
  7. నత్తప
  8. చింత