పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

బసవపురాణము

మెఱుఁగఁగ జాలక యిన్నిరూపములు - వఱలఁగఁ దాల్చిన తెఱఁగునుబోలె
అట్టి జంగమ సభాభ్యంతరాళమున - నొట్టిన రత్నంపుఁదిట్టలకఱుత
భక్తుల కేనసూ బండారి నన్న - యుక్తి నబ్బసవరా జుండె వెండియును
వారక యా మడివాలుమాచయ్య - గారల శ్రీపాదకంజంబులకును
మున్ను సాష్టాంగుఁడై మ్రొక్కుచుఁ జేరి - సన్నుతి సేయుచు శరణు వేఁడుచును
“నీ మహత్త్వముఁ జూడ నే నెంతవాఁడ - ధీమణి! సంగయ్య! దేవ! సర్వజ్ఞ!
నీవు శంకరుఁడవు నేను గింకరుఁడ - నీవు నిర్మలుఁడవు నేను దుర్మలుఁడ
నీవు విజ్ఞానివి నే నవిజ్ఞాని - నీ వమృతాంగుండ వే విషాంగుండ
నీవు మహాదాత వేఁ గృపణుండ - నీవు వశుపతివి నేఁ బశుజీవి
స్వామి! త్రైలోక్య చూడామణి వీవు - భూమి నిర్భాగ్యచూడామణి నేను
బొరి నిట్టి దుర్గుణంబులప్రోఁకలోన - నరయంగఁ గలదె నా యందు సద్గుణము
రక్షింపు మిట్టిగర్వప్రాప్తు నన్ను - శిక్షింపవే యయ్య! జియ్య నాదైన
యపరాధశతసహస్రావలి సైఁచి - విపరీత మహిమాఢ్య! వేయునునేల?”
అనుచున్న బసవన్న నందంద కౌఁగి - టను జేర్చి కారుణ్యవనధి నోలార్చి(ర్చె?)
“కలుగునే కాదె లింగంబునందైనఁ - దలఁపఁ గోపప్రసాదంబులు రెండు
చేరింటికైనఁ జెచ్చరఁ [1]గడువఁగొను - వారు సేపట్టరు వాయించికాని
ధర నంతకంటెను దమ భృత్యవితతి - [2]నొరయక చేపట్టుదురె యట్లుఁగాక
యందులమాలిన్య మడఁపఁగఁ గాక - యెందుఁ జీరల కల్గునే రజకుండు?
అట్టిద బసవయ్యఁ బట్టి మాచయ్య - ధట్టించి నిర్మలత్వంబు నొందించె
నెన్నంగ వేమాఱు నెంతగాఁచినను - వన్నెక్కుఁగాదె సువర్ణంబు మిగుల
నింతింతగాఁ జేయ నిక్షుఖండంబు - నంతకంతకుఁ దీపు లధిక మౌఁగాదె
ఱంపానఁ [3]గోసిన ఱాచిన నెఱయఁ - గంపెక్కుఁగాదె శ్రీగంధంబునకును
ఱాచిన మడివాలు మాచయ్య యెరసి - చూచుడు బసవయ్య శుద్ధసద్భక్తి
తనరంగ నేఁడుగదా! తుదముట్టె" - ననుచు భక్తాళి కీర్తన సేయుచుండ
ముకుళీకృత వికంపితకరాబ్జుఁడైన - సుకుమారు బసవయ్యఁ జూచి మాచయ్య
“విను మహంకారించినను భక్తియగునె - విని యెఱుంగవె పురాతనులలోపలను

  1. గుడుప(డ్ప?) విలుచు
  2. నరయక
  3. ద్రెంచిన