పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

109

బసవన్న మాచయ్య కడకేగి మన్నింప వేఁడుట

నంత నంతయు విని యాత్మలోఁగలఁగి - యంతంత ధరణి సాష్టాంగంబు లిడుచు
బసవఁడు భక్తజనసహాయుఁ డగుచు - వెస నేఁగుదెంచి భయసమగ్రవృత్తి
మడివాలుమాచయ్య యడుగులపొంతఁ - బుడమి సర్వాంగముల్ వొందంగ మ్రొక్కి
“యాక్రాంత సంతతాహంకార నిరతు - నక్రమాలాపు నిర్వక్రాపరాధు
నూర్జితక్రోధు వివర్జితసత్యు - దుర్జనాచారు ననిర్జితకాము
నజ్ఞానపుంజంబు నపగతశౌచు - విజ్ఞానహీను వివేకవిదూరు
నిర్భాగ్యచూడామణిని భక్తిరహితు - దుర్భావకు నవినీతుని నన్ను నింకఁ
గాచి రక్షింపవే కారుణ్యపాత్ర!- యేచినమద్గర్వమెల్ల మాయించి
లాలితంబుగ నాల్గు లక్షలమీఁద - నోలి [1]నర్వదినాల్గువేలగీతములు
గావించుటిది [2]యెగ్గు గని యేవగించు - భావన నాకయ్యె నీవు గైకొనమి
నా యతప్రీతి నోయనకున్న నింకఁ - జా! యనవయ్య నా సంగయ్యదేవ!”
యనుచు నిట్లాత్మనిందాతిదీనోక్తు - లను విన్నవించుడు విననట్ల వినియు
జంగమపరతంత్రుఁడంగావికారి - లింగదమాచఁడాలీఢశౌర్యుండు
“నధముఁడా! క్రొవ్వితే? హరభక్తులరయ - నధములే? నీవొకయర్థాధిపతివె?
అడిగెడువారు లేకయ్య నీ వింత - బడగవైతివి; మజ! బాపురే!” యనుచు
“అట్టియాచకుల నే నటు గందుఁగాని - యిట్టిత్యాగులఁ గాన మేలోకములను
పాన లిన్నియునేల? బసవ! నీయిచ్చు - నేనికదున్నలు నిలఁబచ్చమన్ను
గుఱ్ఱపుగాడిదల్ గుటిలంపుసతులు - నెఱ్ఱకోకలు బ్రాఁతియే శరణులకు
నీ దిక్కుఁ జూడుమా నాదు జంగమము పేదఱికములేని పెల్లు సూపెదను
[3]నదిగొ” మ్మనుచుఁ జల్ల నందంద నెగయు - సదమలోదకకణజాలమంతయును
మరకత [4]నీలనిర్మల పుష్యరాగ - వరవజ్ర విద్రుమ వైడూర్యముఖ్య
వినుతరత్నాచలవితతియై వెలుఁగ - నినుఁడు ఖద్యోతమ [5]ట్లిరవిరిఁ(?)దోఁప
నట పౌరు లత్యద్భుతాక్రాంతు లగుచు - నిట బిజ్జలుఁడుఁదారు నేతెంచి చూడ
నమరి మాచయ యుండెఁ బ్రమథప్రసాద - విమలపుష్పాంచితవృష్టి పైఁగురియ
బసవని నభిమతఫలములఁ దనుప - నసమాక్షుఁడర్చితుఁడై యున్నయట్లు
జంగమంబొప్పె నాలింగావతార - సంగతి మాచయ్య సద్భక్తిమహిమ

  1. నిర్వది
  2. యెట్లుఁగని యెలుఁగించు
  3. నదెకొ
  4. మౌక్తికమణి
  5. ట్లిఱివిరి