పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

105

శివభక్తులకు నెగ్గుసేయు పాతకుల - నవిచారమునఁ జంపునట్టినేమంబు
ప్రాణస్థలంబుగాఁ బ్రమథోక్త శివపు- రాణార్థపదవిశారదుఁడన నొప్పి
యుండంగఁ జోడమహోర్వీతలేశు - శుండాల మతిరౌద్రపిండితంబగుచుఁ
గలితమదో[1]ద్రేకజలధారలొలుక - వలవేగమున ననివారితవృత్తి
విడివడి యప్పురవీథి నేతెంచు - నెడ నొక్కభక్తుండు గడజాము లేచి
వేవునో ప్రొద్దని వేవేగ మంచి - పూవుఁదోఁటలు సొచ్చి భావించి చూచి
పరగిన [2]పెనుగాలి బలువునఁ జేసి - చిరిఁగిన ఱేకుల ఛిద్రపుష్పములు
క్రిగ్గాలి దూలఁదాఁకినఁ బొంగి తుదలు - బుగ్గరించినయట్టి మొగ్గ పుష్పములు
సుడిగాలిఁగడివోయి తొడిమలు వదలి - పడియున్న యాస్వయంపతితపుష్పములు
[3]మఱుఁగులఁ గొమ్ములమాటులఁ దుదల - [4]నొఱపున నున్నపర్యుషితపుష్పములు
బహుకీటకోత్కరనిహతిచేఁ దావి - రహితమైయున్న యుపహతపుష్పములు
కావని వర్ణించి కమనీయమైన - తావి వొంపిరిగొని తనరుపుష్పములు
సజ్జ నిండఁగఁ గోసి సంభ్రమంబడర - సజ్జన భక్తుఁ డాసామజంబెదుర
హరపూజనోత్సవపరవశుండగుచు - నరుదెంచుట నక్కరి గూడముట్టి
తుండాగ్రమునఁబట్టి [5]తూకించివైచి - రెండు గొమ్ముల నొక్కె రుండంబుగాఁడఁ
బ్రాణవియోగతాపమున భక్తుండు - "ప్రాణేశ! శివశివ! పరమాత్మ!” యనిన
యెలుఁగు [6]వినేతెంచి యిఱువదాండారి - మలహరభక్తునిపలుకుగా నెఱిఁగి
బిట్టుల్కిపడి మదిఁ [7]గట్టుగ్రుఁ డగుచు - "నిట్టియార్తారవం [8]బేమొకో!” యనుచు
బఱతెంచి భక్తునిపాటు భద్రేభ - మఱిముఱితనము నల్లంతటఁ గాంచి
నిశితకుఠారసన్నిహితుఁడై పొంగి - 'పశువ! త్రుంచెద [9]నిన్నుఁబఱవకు' మనుచు
మార్కొన నతనికి మలయుచు గజము - మార్కొని యెదిరె నున్మదము వట్రిల్ల
నేనిక రక్కసుఁడీశ్వరుమీఁదఁ - గానక పఱతెంచు గతియును బోలె
దీకొనఁ[10]గని, మదోద్రేకవిజృంభి - తాకారుఁడై పేర్చి యార్చి మైవెంచి
సంహారరుద్రుని చాడ్పునఁ గోప - రంహస్స్ఫురణమయి సింహనాదంబు
పూరించి చూపఱ దూరించిపాఱ - వారించి మదకరిఁ గారింతు ననుచుఁ
బఱతెంచి తొండంబుఁ బట్టి రాఁదివిచి - [11]మఱి నేల [12]కొఱగిన మా వంతుఁబట్టి

  1. ద్రిక్క
  2. ఱేకులుబలుగాలి నెడలి - చిరిఁగియున్నట్టియా
  3. మదుగుల
  4. నొదవుల
  5. తూలించి
  6. కేతెంచిన
  7. గట్టుగ్రమగుచు
  8. బిదియేమి
  9. దున్న
  10. గరి
  11. పిఱిఁదికి నూఁకి పైకెఱఁగి మా వంతు
  12. కొఱిగిన, కొఱుగనమ్మా