పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

బసవపురాణము

నంతటఁబోక మావంతులు నూక - నంతంత డగ్గఱు నంతకుమున్న
వెన్నున నెలకొనియున్న వస్త్రములు - నన్నభోమార్గంబు[1]నందఱియించి
చేతిగంటయు నంద చేర్చి మైవెంచి - చేతులు [2]సమరుచు నేతెంచి [3]చూచి
దండియై మావం[4]తుతండంబుఁ జంపి - తుండంబుఁ జేపట్టి త్రోచి రాఁదిగిచి
యంజలిగుంజలి [5]యల్లార్చి పేర్చి - భంజింపుచును వీరభద్రుండు దివిరి
వడి నృసింహునివైచు వడుపున వైచుఁ - బడనీక లోచేతఁ బెడచేత వేయు
నచ్చుగా నార్చుచు హరుఁడిభదైత్యు - వ్రచ్చినగతి వచ్చివందఱలాడుఁ
గోపించి విష్ణునికోలెమ్ము రుద్రుఁ - డేపునఁ [6]దునిమినట్టిల నెమ్ములేఱు
మాలకు మాంసంబు మఱి గొడారికిని - దోలు[7]ను గాకుండఁదొలఁగంగ వైచి
త్రోవ నేతెంచుచోఁ దొలఁగనిబాస - గావున నతులవీరావతారుండు
నిమ్మార్గమున భక్తులెల్ల నుప్పొంగ - నమ్మదకరి పొడవడఁచి[8] యక్షణమ
“ఎవ్వండు నా మీఁద నేనుంగుఁ గొలిపె - నవ్వసుధేశుక్రొవ్వడఁతుఁ బొ""మ్మనిన
నింతవృత్తాంతంబు నెఱిఁగి బిజ్జలుఁడు - నంతక [9]మున్ను మోమల్లన వంచి
బసవని దెసఁ జూడఁ బరమహర్షమున - వసుధేశునకు బసవనమంత్రి యనియె

బసవఁడు బిజ్జలునకు శివభక్తులమహిమఁ జెప్పుట


“వలదని వారింప వారింప వినక - చలమునఁ బంచితి జనులమాటలను
నేనుంగుఁ గోల్పడె మానంబు వొలిసెఁ - దూనిక చెడె శివద్రోహంబుఁ దగిలె

ఇరువదాండారి కథ


ధరణీశ! విను తొల్లి ద్రావిళభూమిఁ - గరయూరిచోడభూవరుని రాజ్యమున
మున్నరవాద్దడిమువ్వురిలోన - నెన్నంగ నొక భక్తుఁడిరువత్తుఁ డనఁగ
నపగతసర్వసంగపరీత చరితుఁ - డపరిమిత ప్రతాపానూనకీర్తి
సాహసాంకుఁడు శివద్రోహరగండఁ - డాహవవీరభద్రావతారుండు
సకలలోకప్రపంచకళావిరక్తుఁ - డకుటిలచిత్తుఁ డత్యద్భుతకీర్తి
సకల శాస్త్రాభ్యాసశౌర్యాన్వితుండుఁ - బ్రకటశివాచారపరుఁ డనఁబరగి
యౌవనప్రారంభమందు సద్భక్తి - భావనుఁడై భయభ్రాంతుల మీఱి
విస్మయలీల శ్రౌతస్మార్తవిహిత - భస్మరుద్రాక్షవిస్ఫారాంగుఁడగుచు
వరభక్తసందోహచరణారవింద - పరిచరణ క్రియాపరవశుఁడగుచు

  1. నందు సంధించి
  2. దిమరుచు
  3. యెదిరి
  4. యార్చిమైవెంచి
  5. విఱిచినట్లె మ్ములువిఱుచు
  6. నన్నట్లుగాఁ
  7. యేతెంచి
  8. మున్నఱువత్తాడి