పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

103

[1]ప్రకటితకపట నాటక సూత్రములను - వికృతి ప్రకృతులార్చు వెండీఁడు నతఁడ
కులనగంబులు నూకి జలధులు సల్లి - పొలము [2]వోడేర్చు నా బోయయు నతఁడ
ఏకార్ణవంబైనయెడ నజాచ్యుతులఁ - జేకొన కుదికెడు చాకియు నతఁడ
మహితభక్తాళికి మడుఁగులు సేఁత - మహినిప్డు మడివాలు మాచయ్య యనఁగ
నిన్నియుఁ దానయై యిట్లున్నయతని - కెన్నెద వొకగులంబిది నీకుఁదగునె?
కారణపురుషావతారుఁ డాయయ్య - చారుచరిత్ర విస్మయమెట్టులనిన
నరసింహశార్దూలకరిదైత్యచర్మ - పరిధానుభక్తులపరిధాన వితతి
గాని యొండుదుకఁడు, వానిని నంటఁ - గానీఁడు నితరుల ఘట్టించునెడను
భక్తుల చీరల భక్తులకిచ్చు - యుక్త సద్భక్తినియుక్తి వట్రిల్ల
జంగమంబడిగిన సమకట్టనిచ్చు - భంగిగా లింగసంపద దులుకాడఁ
జీరలువైచినవా[3]రడిగినను - వారికిఁ దమతమ వస్త్రంబులిచ్చు
నటమీఁద నతని మహత్త్వంబు వినఁగఁ - గుటిలాత్ములకు సమకూడదు మఱియు
జీర లంటినమాత్రఁ గారించుభక్తుఁ - డూరకుండునె చంప కీరు వోయినను
వల దభిమానంబు వొలివుచ్చుకొనకు - మిల నొరులేల నీ వెత్తిపోయినను
జుట్టవ్రేలను జక్కఁ జూపఁగఁగలవె? - అట్టేల? వల” దన్నఁ గట్టుగ్రుఁ డగుచుఁ
"గారణంబులుఁ గథల్ గల్పింప కిచట - నూరక చూచుచు నుండు మీ” వనుచు
బసవని వారించి పాపాత్ముఁ డంత - వెస యామికులఁ జూచి "వేఱుపాయమునఁ

బిజ్జలుఁడు మాచయ్యను జంప నేనుఁగుఁబంపుట


దొలఁగకాతఁడు వచ్చుత్రోవను మీరు - [4]తలఁగ కాతనిఁ దలతలమని నిలిచి
సమదాంధగంధగజంబుఁ బైకొలపి - సమయింపుఁ" డనవుడు జనులుత్సహింప
మావంతు లేఁగి సామజముఁ బైకొలిపి - యా వీరవరురాక కరికట్టి [5]నిలువ
నల్లంతఁ బొడగని యార్చి బొబ్బిడుచుఁ - "గల్లినాథుని భద్రగజ మొక్కనరుని

మడివాలు మాచయ్య యేనుఁగును జంపుట


యేనికదున్నకు నేల పంకించు - మానవుల్చానక మగుడఁడో” యనుచు
గంటయుఁ గొడుపును గదియింపఁ దడవ - పంటించె నేనుఁగుఁ బలమెల్ల నవిసె

  1. ఈ ద్విపద కొన్ని మాతృకలయందు మాత్రముగలదు.
  2. బోదేర్చు
  3. వారడ్గఁదడవ
  4. తొలఁగకాతనిఁ దొలతొల
  5. యెదుర... యార్చినఁజూచి-క