పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

బసవపురాణము

ఆకసంబునకేఁగు నట్టలుఁగలవె? - చాకి రక్కసిక్రియ జనుల మ్రింగెడిని
తిట్టఁడు వలుకఁడు ముట్టినమాత్ర - నిట్టు సంపఁగఁ గూడునే పెఱవాండ్రఁ
బాడిఁదలంపక బత్తుండననుచుఁ - బాడుగాఁ జంపు నీ పౌరులనెల్ల”
ననుచుఁబురోహితు లనుమతంబునను - దన యామికులఁజూచి ధారుణీశ్వరుఁడు
“చాకి నచ్చోటన చంపుండు వొండు - కాక మ్రింగిన వానిఁ [1]గ్రక్కిన రండు”
అనవుడు బసవఁడిట్లనియె నాతనికి - "విను మీఁదెఱుంగక వెడలనాడెదవు

బసవఁడు బల్లహునకు మడివాలు మాచయ్యమహిమఁ జెప్పుట


లేకులు [2]లోకుల కాకఱపులకుఁ - “జాకిచా”కని యేల సందడించెదవు
చాకియే యతఁడు సాక్షాల్లింగమూర్తి - కాక యేటికిఁ గనుకనిఁబలికెదవు
కులజుండు నతఁడె యకులజుండు నతఁడె - కులములేకయు నన్నికులములు నతఁడె
ఆ నీలగళు నపరావతారంబు - గాన యాతఁడు సర్వగతుఁడెట్టులనిన
సరసిజభవుజడల్ జన్నిదంబులుగఁ - బరగ భిక్షించిన బ్రాహ్మణుఁడతఁడ
మహితాపవర్గ సామ్రాజ్యపట్టంబు - వడి భవాంబుధిఁద్రిప్పు వైశ్యుండు నతఁడ
యిల సత్క్రియారంభఫలములు గోసి - సొలవక నూర్చెడు శూద్రుండు నతఁడ
యాదిశక్తియ మున్నుపాదానముగను - [3]నాదబిందులు గారణంబుగఁ దగిలి
వేడుక బ్రహ్మాండ వివిధ భాండములఁ - గూడ వానెడు [4]నాది కుమ్మరి యతఁడ
హరియెమ్ము దండంబునహిపతి ద్రాడు - నరసింహుపెనుపగు నఖరంబు గ్రొంకి
[5]యవని మోచినవరాహం బెఱగాఁగ - నవనిఁ గూర్మంబును నల్లమత్స్యంబు
గాలమి ట్లేకోదకంబునఁదిగిచి - లీలనటించు నా జాలరి యతఁడ
చటుల సంస్కృతి జీవఘటచక్రకర్మ - పటుపరివర్తన భ్రమణంబుఁ గూర్చి
కీలు వొందించి యా క్రియ [6]రాటనముల - వాలి యాడించు నా వడ్రంగి యతఁడ
మును జీవమను లోహమునకు జ్ఞానాగ్ని - నొనరఁగఁ బదనిచ్చు కనుమరి యతఁడ
ఇచ్చుచో నెఱిఁగి కల్లచ్చుల నూకి - యచ్చుల నొరగొను నగసాలి యతఁడ
హరిణమై రమియించు నజునిశిరంబు - శరమునఁద్రెంచిన శబరుండు నతఁడ
హరిముఖ్యకృమికీటకాదిపశువుల - వెరవునఁ బాలించు వ్రేఱేఁడు నతఁడ

  1. గ్రక్కెనే
  2. లేకుల
  3. నాదు బిందువుఁగా
  4. నాఁటి
  5. ననలికూ
  6. వరాటనము