పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

97

బ్రాఁకువట్టినపండ్లు బ్రద్దచేతులును - వీఁక కాళ్లును నడ్డివీపును దనర
ములుగత్తియుచ్చుఁ గోకలుఁజూఁడుఁగొడుపు - మొలతిత్తి నిడిదొడ్డ మొలకచ్చగట్టి
గాలిదప్ప(బ్బ)ఱ వెండ్రుకల్ దూలియాడ - నీలవెట్టుచు నుఱి[1]మెఱ్ఱఁ జూచుచును
గుక్కలఁ బిలుచుచు ఱిక్క వెట్టుచును - నెక్కొన నొరగాల నిలుచుచుఁ జనుచు
గొడ్డలి [2]బరిగమ్మి గూటికుండయును - దుడ్డుఁగోలయుఁ బట్టి తొడిఁదొడిఁగొన్ని
మేఁకపిల్లలఁ దన చాఁకిట నిఱికి - వీఁక దబ్బఱవాట్ల విసరివ్రేయుచును
గొన్ని మేఁకలరొప్పికొని వచ్చి తుమ్మ - నున్న కాయలు రాల్చియును నంతఁబోక
యిమ్ములఁ దన మీఁది [3]కొమ్మెక్కుగొల్లఁ - గ్రమ్మఱ నఱకంగఁ గలుషించిచూచి
“నా మీఁదికొమ్మేల నఱకె[4]దు రోరి - గామిడిగొల్ల! యీ కాననంబునను
మాకు నీడై యున్న యీ కొమ్మెకాని - చేకొని నఱకంగఁ [5]జెట్టులు లేవె?
శంకమాలితి క్రొవ్వి చక్క మైమఱచి - యింక నా చేత నీ వెట్లు సాఁగెదవు
పాపవుగొల్ల నిన్ బఱతుఁగా క”నుచుఁ - గోపించి తిట్టుడు గొల్లండు నవ్వి
“బాపురే నిర్వాణి! బాపురే తపసి! - బాపురే బాపురే కోపపుంజంజ!
పాపంబుఁ బొందెడుకోపించువాఁడు - పాపిగా కేనేల పాపి నయ్యెదను
స్ఖలియించు కోపాగ్ని కణములఁజేసి - కలఁగదే మానసఘనసరోవరము
ఎసఁగెడు కోపాగ్ని నింకదే చెపుమ - మసలక హృదయాబ్జమకరందధార
[6]వెలువడు కోపాగ్ని వేఁడిమిఁజేసి - నలఁగదే సచ్చిదానందపద్మంబు
జ్ఞానంబు సొంపొ! విచారంబు పెంపొ? - ధ్యానంబుఫలమొ యీ తామసగుణము?
నా కేమి సెప్పెద, వీకాననమున - లేకున్నవే చెట్లు నీకుఁగూర్చుండ
నిట్టిశాంతాత్మకు లెచ్చోటఁగలరు! - పుట్టుదురే నినుఁబోల సంయములు!
వఱదవోవునెలుఁగు గొఱుపడంబనుచు - నెఱుఁగక యీఁత కాఁడేఁగి పట్టుడును
వడిఁ బాఱునెలుఁగంత వానినపట్టఁ - గడనున్నవాఁ'డోరి! విడువిడు' మనుడు
'విడిచితి నది దన్ను విడువ' దన్నట్టి - వడువున విడిచిన విడుచునే [7]మాయ
పొంగి చిచ్చుఱుకంగఁ బోవుచుఁ జీర - కొంగోసరించు పెన్వెంగలియట్ల
[8]చెల్లుఁ బొమ్మని సన్న్యసింపఁబోవుచును - నిల్లప్పగించు నయ్యిబ్బందియట్ల
పదిపడి నూతిలోఁబడఁబోయి తాప - వెదకుచు మెట్టెడి [9]వీఱిఁడియట్ల
జ్ఞానాత్ముఁడై సర్వసంగముల్ విడిచి - తా నాశ్రమముఁ గోరు తపసిచందమున

  1. ముఱిమిచూచు
  2. యునుగమ్మ
  3. కొమ్మయొక్కతఁడు
  4. దవోరి
  5. జెట్లు లేవెట్టు?
  6. వెలిఁగెడు
  7. యాస
  8. చెల్లెఁ బొమ్మని
  9. వీఱఃడి