పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

బసవపురాణము

పరమయోగీంద్రుఁడో? భసితంపుగిరియొ? - ధరఁబడ్డ రుద్రాక్షధరణీరుహంబొ?
సదమలజ్యోతియో శంభురూపంబొ? - విదిత చిదబ్ది సముదితపూరంబొ?
యెచ్చోటఁ బోవరాదెట్లోకో” యనుచు - నచ్చెరువంది మాదాఖ్యుఁ "డీ క్రమము
నరయుదు”నని యుత్తమాంగంబు దిక్కు - పరిగొని మూఁడేఁడులరసి కానకయుఁ
బదపద్మములమీదఁ బడ కిటువచ్చు- టిది దప్పు దానంచుఁ బదపడి మగిడి
యచ్చోటనుండి యయ్యడుగులదిక్కు - గ్రచ్చర వర్షాష్టకమునకు వచ్చి
యంత భయభ్రాంతుఁడై “నీదురూప - మంతసూపక యేలయా! యిటు లేఁప
నే నెంతవాఁడ నిన్నెఱిఁగెద ననఁగ - నానందమూర్తి! నీ యడుగులు సూపి
రక్షింపవే” యని ప్రస్తుతింపుచును - బక్షద్వయము సాఁగఁబడియున్నఁ జూచి
యయ్యవసరమున నమ్మల్లికార్జు - నయ్యగా రంతఁ బ్రహసితాస్యుఁ డగుచుఁ
దన తొంటిభావంబుఁదాల్చి "నీ మనసుఁ - గనుఁగొననిట్లైతి” ననుచు మాదాఖ్యు
“లెమ్మ”ని చెయి సాఁచి లేవంగనెత్తి - క్రమ్మఱ నందంద కౌఁగిటఁ జేర్చి
“యిట్టి సాహసి వౌదువేమమ్ముఁ జూడ - నెట్టయా వచ్చితి విచ్చటి” కనుచుఁ
దన నివాసస్థానమునకుఁ దోడ్కొనుచుఁ - జని యంతలింగావసరము సేయించి
తన ప్రసాదము వెట్టి యనుపమతత్త్వ - జనితానుభవసుధావనధిఁ దేల్చుచును
గొంతవ్రొద్దటయుంచుకొని యుండి“యింకఁ - గొంతగాలము గ్రియాభ్రాంతిమైధరణి
నుండఁగఁదగు” నని యురుతరకీర్తి - మండితసద్గురు మల్లికార్జునుఁడు
నానతియిచ్చుడు నమ్మాదిరాజు - "తా నెట్లు వోవుదు నానందమూర్తి
తగు నిఱుపేద నిధానంబుఁ గాంచి - దిగవిడ్చి యేఁగునే [1]మగిడి కూలికిని?
కంటి మీ శ్రీపాదకమలంబులేను - మంటి నింకేటికి మగుడుదు ననిన
మెల్లన నవ్వుచు [2]మేలు గా కనుచు - మల్లికార్జునుఁడు సముల్లాసకీర్తి
నిత్యస్వరూపవినిశ్చితం బైన - ప్రత్యయంబుల నొడఁబఱపఁగఁ దలఁచి
“యట్టేని ర”మ్మని యట నొ(యొ? )క్కదుమ్మ - చెట్టు గావించి నిశ్చింత సమాధి
నిట(యుం?) నుండు మీవని యట యేఁగి తాను - గుటిల వేషంబున గొల్లని భాతి
బఱపువేళ్లును మొద్దుఁ బాదముల్ గుజ్జు - చిఱుదొడలును దొప్పచెవులును బరడు
ప్రక్కలు బీఱనరములును జిదక - ముక్కును ముడిబొమల్ మొగిదోని కడుపుఁ
బొక్కిళ్లువోయిన చెక్కిళ్లు వలుద - బొక్కిఱొమ్మును బెద్దనిక్కిన మెడయుఁ
బల్లమీసములు నేర్పడు కాయకన్నుఁ - బిల్లి గడ్డంబును నల్లని మేనుఁ

  1. మగుడి, మగుడఁ
  2. మేలకాక