పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

బసవపురాణము

నాతనిచేఁ గొన్న యాకన్ను నిచ్చె - నో తన కన్నిచ్చెనో శివుఁడనఁగ
నంతకమున్ను వామాంబకజనిత - సంతతఘన బాష్పజలధారలుడిగి
కన్నప్ప దేవుని కన్నులు శివుని - కన్నులు[1] వోల నొక్కండైన యట్లు
కన్నప్ప దేవుని [2]నన్నుల నపుడు - సన్నుతానంద బాష్పంబులుదొరిగె
హరుకంటఁ దొల్లి ద్రిపుర వీక్షణమునఁ - దొరిగిన జలములు [3]దోడయ్యె ననఁగఁ
గరుణానిరీక్షణ[4]స్ఫురితాంబుధార - విరచింప నానందకరమగు టరుదె?
అంతటనిఖిలసురాసుర ప్రముఖు - లంతంత మ్రొక్కుచు నభయంబు వేఁడ
మస్తక విన్యస్తహస్తులై మునులు - ప్రస్తుతం బెఱుఁగుచుఁ బ్రస్తుతుల్ సేయ
శివదుందుభులు మ్రోయభువిఁబుష్పవృష్టి - [5]ప్రవిమలంబైకుర్యఁ బ్రమథులుప్పొంగ
గన్నప్ప శుద్ద ముగ్ధతయు మహాగు - ణోన్నతియును భక్తియోగ సంపదయు
నాపరాపరుడు ప్రత్యక్షమైయునికిఁ - గోపించి మును బొంచికొనియున్న తపసి
కనుఁగొనిసంభ్రమాక్రాంతాత్ముఁడగుచుఁ - జనుదెంచిభువిఁజక్కఁ జాఁగిలి మ్రొక్కి
“తలఁప నీ సహజ ముగ్దత్వ మెఱుఁగమిఁ - దలఁచితి నీకహితంబు సేయంగఁ
దప్పుసైరింపు గన్నప్ప! దయాత్మ! - చెప్ప నున్నదె నీవ శివుఁడవుగాక
యిట్టి ముగ్ధత్వంబు నిట్టి వీరత్వ - మిట్టి మహత్త్వంబు నెందును గలదె?
విందుమే యవికల వేదశాస్త్రములఁ - గందుమే మూఁడులోకంబులఁ దొల్లి?
బాపురే! కన్నప్ప! పరమ లింగంబ! - బాపురే! కన్నప్ప! ప్రమథవిలాస
నల్లవో! కన్నప్ప! నా లింగముగ్ధ - నల్లవో! కన్నప్ప! నల్లనైనార!”
అనుచు నిట్లా తపోధనుఁడతిభక్తి - వినుతింప నుమబోటి విస్మయంబొందఁ
గన్నప్ప! శివుఁడు నాకాంక్షనొండొరులఁ - గన్నులఁజూచుచు నున్న యత్తఱిని
దవిలి యొండొంటితోఁ దగునన దొరసి - నివిడ యొండొంటితో నిద్దమై బెరసి
చూపులు సూపుల లోపలఁజొచ్చి - యేపార నేకమై యెంతయు నొప్పి
కన్నప్పదేవుని కన్నుల సఖులొ! - అన్నీలకంధరు కన్నుల కవలొ?
తవిలి కన్నప్ప కన్గవ దర్పణములొ? - భవునయనంబుల ప్రతిబింబ యుగమొ?
నెమ్మిఁ గన్నప్ప నేత్రమ్ములపా[6]య - గొమ్ములో? శివునేత్రగుప్తాంకురములొ?
రమణఁగన్నప్ప నేత్రముల బీజములొ? అమృతాంశు శేఖరు నక్షఫలములొ?
అనఁగఁ గన్నప్ప దేవునిలోచనములు - మనసిజహరునిలోచనములై శివుని

  1. కొలికి
  2. కనుగవ
  3. దొడరెననంగ
  4. స్పురితసుధాబ్ధి
  5. నవిరళంబై
  6. యుగొమ్మ(మ్ము)లో