పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

బసవపురాణము

అనయంబు రజితాద్రి[1]యట్టిదుర్గంబు - మనకుఁ గల్గఁగ వేఱె మన్నెముల్ సేసి
కొనియుండనేల యీ వనదుర్గ మందుఁ" - [2]జనుసనుమనుచుఁ బుష్పకవిమానంబుఁ
జక్కన నద్దేవు నెక్కించి తాను - నెక్కి దీపదకళి యెంతయునొప్పు
గుడియు మంటపమును గోటయుఁగూడఁ - గడునర్థిఁ గొనిపోయెఁ గైలాసమునకుఁ
బురహరు మెప్పించి బొందులతోన - యరుగుభక్తులు గలరన్నిలోకముల
గుడితోన లింగంబుఁ గొనిపోవుభక్తుఁ - డడరఁగఁ గలఁడయ్య! యఖిల లోకములఁ
గడుఁగడుఁ జోద్యంబుగాదె తలంపఁ - బుడమిఁ బుట్టనిభక్తిఁ బుట్టెఁదా ననుచు
దేవదానవమానవావలి వొగడఁ - గా వీరభక్తశిఖామణి యైన
యట్టిదీపదకళియారి ముగ్ధత్వ - మిట్టలంబైయొప్పె నిల” నట్టుఁగాక

నాట్యనమిత్తండి కథ


“కడునొప్పు వెండియుఁ గంచిలోపలను - మృడుమూర్తి నాట్యనమిత్తండి యనఁగఁ
బోఁడిగా శివభక్తపుంగవుఁడొక్క - నాఁడు శ్రీ యేకామ్రనాథుని గుడికి
నాయతభక్తిమై నరిగి కూత్తాడి - నాయనారిని సదానందస్వరూపిఁ
దాండవమూర్తి నత్యద్భుతాకారు - దండిగజాసురదళనావతారు
బాలేందు శేఖరు ఫాలలోచనుని - గాలకంధరు శూలఖట్వాంగధరునిఁ
బొడగని పూజారి నడిగె “నీశ్వరుని - [3]నడుమటు వీఁగియున్నది యొక్కదెసకు
వారక కొంకరవంకరల్వోయి - గౌరీశుచేతులు పూరించి[4]నవియు
ముక్కొంకులును బోయి మోచియు మోవ - కొక్కవాదంబట్టులున్నది శివున
కున్నపాదంబును నూరుమధ్యమున - నున్నది [5]యీచవో యున్న భావమున
నిలువులువడి శివునేత్రత్రయంబు - నొలుపుగా ఱెప్పలు వొందకున్నవియు
మలహరుశిరమును [6]నిలువక యొక్క - వలనిక యంతయు వ్రాలియున్నదియు
మృడదేవు కెంజడ [7]ముడివీడినదియుఁ - గడుఁజోద్యమిదియేమి గారణం?"బనుడు
నా శివబ్రాహ్మణుఁడల్లన నగుచు - “నీ శివునకు రోగమిట్టులైనదియు
వాయు [8]దోషము దీని వారింపకున్నఁ - గాయజహరునకుఁ గడుఁ బ్రమాదంబు
దడసిన నింకొండు దలఁచిన శివుని - యెడలెల్లఁ గూడ నిప్పుడ కొంకు [9]వోవు
దీనికి నౌషధంబే నెఱుంగుదును - బూని చేయింపుమా మానెడు” నంచు
నాలిసేయుచుఁ బల్క నది దథ్యగాఁగ - నా లింగవంతుఁ డట్లాత్మఁదలంచి

  1. యనెడు
  2. జనుమందునపుడు
  3. నడుమునువిఱిగి
  4. నయవి
  5. యూఁచ
  6. నలవోక
  7. ముడియవీడినది
  8. దోషంబింక, దోషంబిది
  9. లొదవు