పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

77

తనయింటఁగల పదార్థమ్ములు ధనము - [1]మునుకొని కొనివచ్చి ముంద[2]టఁబెట్టి
"కోరియింతయును జేకొనియైననిపుడు - మారారిరోగంబు మాన్చి తేనియును
నా సతియును నేను నా సుతుల్నీకు - దాసులమయ్యెద మాసక్తితోడ
నెట్టైన నీ వింతవట్టు పుణ్యంబు - గట్టికోవే” యనఁ గల ధనంబెల్లఁ
గొని"వాయుతైలంబుఁగూర్చి యౌషధము - లెనయంగవండితి” ననుచు నాముదము
నూనియ నొక్కింత నులివెచ్చఁ జేసి- చేనిచ్చెఁదత్క్రియ సెప్పుచు నతఁడు
వాయుతైలముఁ గొనివచ్చి యక్షణమ - మాయాపహరుమేన మర్దనసేసి
తవిలి యా వావిలిచివుళులుమ్మెత్త - చివుళులు [3]దక్కెడిచివుళు [4]లాముదము
చివుళులు పండినజిల్లెడాకులును - నివి యాదిగా మందులిన్నియుఁగూర్చి
చెచ్చెరఁ దనువెల్ల సేకంబుసేసి - పొచ్చెంబు లే కిస్ముపొట్లాలఁ గాఁచి
పుచ్చుచు నరచేత వెచ్చఁ జూపుచును - నిచ్చ యెఱిఁగి కాఁక లిచ్చును వలయు
పథ్యంబులారగింపంగఁ బెట్టుచును - [5]దథ్యంబుగా వెండి తగుక్రియ ల్సేయఁ
గొన్నిదినంబులు సన్నఁ దద్భక్తుఁ - డన్నీలగళుఁ జూచి "యిన్ని నాళ్లయ్యె
నాపోవ నొక్కింతయైనను గుణము - సూపదు వార్వతీశుశరీర మందు
నననేల! నిక్కము నట్టిద కాదె; - పనుగొన నేనెంత భ్రాంతిఁ బొందినను
నారంగ నడవులయాకులు నలము - వేరు వెల్లంకియు మారసంహరుని
యొడలిరోగము మాన్ప నోపునే యింక - నెడసేయనేటికి నేఁగాక శివుని
వాయుదోషమునకు వైద్యుండ”ననుచు - నాయయ్య గడునిశ్చితాత్ముఁడై యంతఁ
దలఁ కించుకయు లేక తన ప్రాణమునకు - నలుగంగఁ బ్రత్యక్షమై నిల్చి శివుడుఁ
పార్వతీకాంతుఁడు భక్తవత్సలుఁడు - శర్వుఁడర్వాచీన సౌమ్యస్వరూపి
గీర్వాణవంద్యుండు [6]సర్వేశ్వరుండు - సర్వజ్ఞుఁడజహరిశతమఖార్చితుఁడు
నాట్యలోలుండు బినాకహస్తుండు - నాట్య [7]నమిత్తండి నలిఁగౌఁగిలించి
“మేదురకీర్తి! నిన్ మెచ్చితి వేఁడు - మాదట నిచ్చెద నభిమతార్ధములు”
ననుడు "నేమియు నొల్లనభవ! మీ దివ్య - తనువు వేఱొండుసందంబైన యదియు
వెండి వంకలువోయి వెడరూపుగాక - యొండేమి గడుఁజూడ నొప్పియున్నదియు
రోగమో! సహజమో! యోగీంద్రవంద్య! - ఈ గరిమంబు నా కెఱిఁగింపు” మనిన
“నిది దాండవాకార[8]మెట్టులంటేని - ముదమున నాట్యాభిముఖుఁడనై నిల్చి

  1. కొనివచ్చిముందటఁ గుప్పగాఁబోసి
  2. తక్కలి
  3. లామిదెపుఁ, జి
  4. దథ్యగా వెండియుఁ ద
  5. కృత్తివాసుండు
  6. నిమిత్తండి
  7. మెట్లంటివేని