పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

బసవపురాణము

కరికాళచోడు(?)వళ్ళెర మిడువాఁడు - గరగ[1]కావటివాఁడు ఘనుఁడు హౌన్నయ్య
రమణీయమగు నోగిరంబుల [2]పరిసె - నమువాఁడు సెన్నయ్య విమలదేహుండు
ఆరగింపఁగఁ బెట్టునవసరంబులది - వీర[3]చోడవగారు విశ్వైకవినుత!
అడపంబువాఁడు రేచయమును(?) [4]బాలు - పడుప్రసాదులు బిబ్బబాచయ్యగారు
మృడుఁడ! మా నాట్యనమిత్తండి వైద్యుఁ - డడరంగఁ గల్లిదేవయ్య! వెండీఁడు
మలహర! సామవేదులు పురోహితులు - వెలయఁ బౌరాణికుం డిల మాయిభట్టు
కోరి మీ పరిహాసకులు గళియంబ - [5]గారు వాగీశనైనారు వాఠకుఁడు
శ్రీపతిపండితుల్ శివుఁడ! మీ [6]కవులు - నా పండితయ్యగా రనుఁగుఁబండితులు
నాదివీణెలవాఁడు మాదిరాజయ్య - నాదరసజ్ఞుఁడు నలి శంకరయ్య
కరణంబు గర్మసంహర! కేశిరాజు - ధర జగదేవుండు దండనాయకుఁడు
గణనాథుఁ డిందుశేఖర! మీ ప్రధాని - ప్రణుతించి [7]చూడ మా ప్రభువు మీ ప్రభువు
ఇఱువత్తుఁడు గజసాహిణి యశ్వసాహి - యొఱపుగాఁ జేరమ యోగియొడయఁడు
అనఘ! రామయ్య యేకాంతంబువాఁడు - నొనర బల్లహుఁడు గుంటన, సఖినంబి
శంకర! నీ బంటు శంకరదాసి - యంకంబువాడు [8]నేణాదినాథుండు
లెంక దా మంచయ్య లీల మీ నగరి - సుంకీఁడు [9]సుంకేశు బంకయ్యగారు
సురియఁబట్టెడువాఁడు సురియచౌడయ్య - పొరిఁగులచ్చిరియారు భువి హేళగీఁడు
హర! నీకు బెజ్జమహాదేవి దాది - ధర రుద్రపశుపతి దామంత్రవాది
సువిధాని! కక్కయ్య భువి జాలగాఁడు - శివరాత్రి [10]సంగయ్య [11]సెలిబోగ[12]తందె
దేవరదాసయ్య దేవ! [13]దాసీఁడు - భావింపఁ గిన్నరబ్రహ్మయ్య బచ్చు
మడివాలు మడివాలుమాచిదేవయ్య - కడమలనంబి సొప్పడ [14]దివ్వెలాఁడు
తెల్లంబు గోడలు దీర్చెడువాఁడు - [15]సల్లీల గోడలమల్లయ్యగారు
కుమ్మరి గుమ్మరగుండయ్యగారు - జొమ్మయ్య వేఁటకాఁ డిమ్మహిలోన
కమ్మ [16]రమ్ములవాఁడు ఘనుఁ డిల్లహాళ - బొమ్మయ్య గీలారి నెమ్మిఁ జండండు
[17]మాయావి బల్లేశుమల్లయ్య [18]గట్టె - బోయీఁడు బాచయ్య భూరికొటారి
పాలువిదుకువాఁడు లీల వంకయ్య - పాలుగావంగ నేర్పరి గొడగూచి
కావున నీదు సకలనియోగంబు - మావారలై యండ మన్మనోరమణ!

  1. కావడి
  2. పరికరము
  3. చోడప
  4. మనవాలు
  5. నారు
  6. కావ్యుఁడా
  7. చూడంగఁ బ్రభువు
  8. నేణాది
  9. బంకీశుసుంకయ్య
  10. బంకయ్య
  11. చవి
  12. తద్దె
  13. మాసీఁ(స్టీ?)డు
  14. దివ్వటీఁడు
  15. బల్లిదుల్
  16. తమ్ములవాఁడు
  17. మాయారి
  18. కొట్టు