పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

47

ఏమిటఁ గొఱఁత? నా కేమిటఁగడమ? - ఏమైన నడుగు నీ కిచ్చెద నింక
మానంబు వదలిన [1]మదిఁ దల్లడిలిన - మానుగాఁ బ్రమధులయాన నీ యాన
కాలకూటము గుత్తుకకు రాకమున్న - క్రాలుపురంబులు గాలకమున్న
గౌరివివాహంబు గాకటమున్న - యార నజాండంబు లలరకమున్న
తివిరి మూర్తులు నెన్మిదియు లేకమున్న - భువి హరిబ్రహ్మలు పుట్టకమున్న
యటమున్న యటమున్న [2]యటమున్నమున్న - యిట నీవు నా స్వామి [3]వేను నీ బంట
కఱకంఠ! [4]యిదియేమి [5]గళవళించెదవు - వఱల నా చేతఁ బోవచ్చునే” యనుచు
నసమాక్షుతోడ [6]మాఱంకమై గెలిచె - బసవఁ డుద్యద్భక్తి [7]భాతిమై నిట్లు

బసవఁడు గొల్లెతచల్లకడవఁ బడకుండఁ బట్టిన కథ


వెండియు నిర్మలాఖండిత[8]కీర్తి - దండనాథాగ్రగణ్యుండు [9]పుణ్యుండు
సజ్జనసుతుఁడు బసవఁ డొక్కనాఁడు - బిజ్జలుకొలువునఁ బ్రీతిఁ గూర్చుండి
“యోడకోడకు [10]మని యొక [11]కడవెత్తు - మాడికి బాహుయుగ్మముఁ జాఁపఁదడవ
“ఇసుమంత” [12]బూడిద నొసలఁ బూసినను - మసలక కొండంతమరు [13]లొందుననుట
తెల్లం” బనుచు రాజు మెల్లన నగుచుఁ - “జెల్లఁబో బసవయ్య! శివమరుల్ గొంటె
[14]బ్రమసితే తలకెక్కి భక్తిరసంబు - గుమతివై నిండినకొలువులోపలను
“నోహో” యనుచు “నోడకోడకు”మనుచు - “బాహుయుగ్మము సాఁచిపట్టుటే”మనినఁ
“స్వగుణసంకీర్తన దగదు సేయంగఁ - దగదని యున్నను నగుసభ” యనుచుఁ
“ద్రిపురారిగుడితూర్పుదెస నేఱునేలఁ - గపిలేశ్వరంబందుఁ దపసి యొక్కరుఁడు
ఆ లింగమునకు నిత్యము నాఱువుట్ల - [15]పాల మజ్జనమార్పఁ గాలువల్ గట్టి
వీథివీథుల వెల్లివిరియ నేనుఁగుల - పాద[16]ఘట్టనములఁ బంకంబు రేఁగ
నా వీథిఁ జల్ల దా నమ్ముచుఁ [17]గణఁకఁ - బోవుచోఁ గాలూనఁ బోయినఁ దొసఁగఁ
గడురొంపిఁ [18]గాలుజారుడుఁ జల్లకడవ - పడఁ[19]బోవ [20]గొల్లెత “బసవరో” యనిన
బట్టితి నచ్చటఁ బడకుండఁ గడవఁ - జట్టన చేతులు సాఁచి యే ననుచు
గొల్లెతరూపంబు గొల్లెతయిల్లు - గొల్లెత యున్న [21]యిక్కువయుఁ జెప్పుటయు

  1. మహిఁ, మఱిఁ
  2. యంతకమున్న
  3. యేను
  4. యిట్లేల
  5. కలవరించెదవు
  6. మాఱాఁకమై
  7. బ్రాఁతి
  8. మూర్తి
  9. ధన్యుండు
  10. మంచునొ
  11. కడువెత్తు
  12. బూడిది, బూడిదె
  13. లెత్తె
  14. భ్రమసితే
  15. పాలు
  16. ఘట్టనచేత
  17. గడవఁబోవుచుఁగాటక బోయినిదొసఁగ (యనఁగ)?
  18. గాల్దెమల్పడఁ
  19. బడ
  20. వ్రాఁతప్రతులన్నింటను 'గొల్లెత' యను రూపమే కలదు
  21. యింకువయు