పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

45

బసవని దృష్టిసంస్పర్శనంబునన - [1]యెసఁగు జొన్నలప్రో(c?)క యిందఱుఁ జూడఁ
బొనరుచు ముత్యాలప్రో(c?)కయై తనరె” - నని భక్తమండలి వినుతింపుచుండఁ

సంగమేశ్వరుఁడు బసవని మూఁడవకన్నడుగు కథ


జెచ్చెర మఱియు నీప్సితవస్తు[2]వితతి - నెచ్చుగా బసవఁ డిట్టిచ్చుటఁ జూచి
“వేడుకయ్యెడు నాకు వేఁడంగ” ననుచు - రూఢిగా జంగమరూపంబుఁ దాల్చి
చక్కన సంగమేశ్వరుఁడ యేతెంచి - గ్రక్కున మూఁడవక [3]న్నడ్గఁ దడవ
ఆయత లింగపసాయితహస్తుఁ - డై "యెఱుఁగనె నీదుమాయ నే” ననుచు
ముకురంబుఁ జూపుచు ముక్కన్ను నీకు - నకలంక! సహజంబ యదె చూడు” మనిన
నద్దంబులోన ఫాలాక్షంబుఁ గాంచి - యద్దేవదేవుండు దద్ద లజ్జించి
యప్పు డక్కడన నిరాకార మగుడుఁ - జప్పరింపుచుఁ జూచి “చా! పంద! పంద!
ఓడకు మోడకు మోరోరి! సంగ! - ఓడకు మోడకు మొకటి[4]యు నొల్ల
నెఱుఁగవే సత్యమాహేశ్వరులిండ్ల - నెఱయంక కానిని నిజగతి నన్ను
దాసయ్యవలె నిన్నుఁ దవనిధి వేఁడ - నా సిరియాలున ట్లాత్మజుఁ గోరఁ
గనకవృష్టి యడుగఁ గరికాలునట్ల - వనితకు నెడవుచ్చు మన నంబిభాతి
వెండియుఁ గుమ్మరగుండయ్య కిచ్చు - మిండప్రాయంబుఁ గామింపఁ గాదేవి
స్వర్గాపవర్గాదిసౌఖ్యంబులొల్ల [5]భర్గ! - [6]నీ ప్రమథుల భక్తులయిండ్ల
నలరుచు డించిన యా ప్రసాదంబె - కలదు భోగింపఁగాఁ గలకాలమెల్ల
సర్వభక్తాత్మ! మీ జలకంబువాఁడు - గుర్వుగా మా కాటకోటయ్యగారు
హర! మీ నగరిమాలకరి పుష్పదంతుఁ - డరిది పూజారి కన్నప్ప [7]దేవయ్య
యిండెగట్టెడిది మా [8]యిండెరేకవ్వ - ఖండదీపమువాఁడు [9]గా నమినంది
నెట్టణ దీవించి నీకు విభూతిఁ - బెట్టెడువాఁడు మా పిళ్లనైనారు
అను[10]షక్తిమై గంధ మర్పించువాఁడు - మనసిజసంహర! మాయణుమూర్తి
వరద! మీ ధూపంబువాఁడు మాచయ్య - వరకీర్తి! మీ గంటవాఁ డోహిళయ్య
ధర మంగళారతుల్ [11]దరిసించువాఁడు - వరద! సోమయగారు శరణవత్సలుఁడు
వంటకట్టెలు దెచ్చువాఁడు మారయ్య - పంటింపఁ గరికాలు పడిపెట్టువాఁడు
కఱకంఠ! యడబాల సిఱుతొండనంబి - [12]మఱి బానసమునది మా సంగళవ్వ

  1. యెసఁగ
  2. సమితి
  3. కన్నడుగుటయు
  4. నేనొల్ల
  5. భర్గుని
  6. ని న్గొల్చిన
  7. దేవుండు
  8. యిండి
  9. కడమలనంబి
  10. రక్తిమై
  11. దనరించు
  12. మఱియు బానసముది