పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

బసవపురాణము

ననుచు భక్తానీక మచ్చెరువంద- నను[1]షక్తి మ్రుచ్చుల నబ్బసవయ్య
యచ్చులఁగాఁ జూచి యభిమతార్థంబు - లిచ్చి భక్తులఁ జేసె [2]నిజ్జగం బెఱుఁగ

జొన్నలు ముత్తెములైన కథ


మఱియును నొకజంగమం బేఁగుదెంచి - యఱిముఱి నభ్యంజనావసరమున
[3]నిత్యనేమం బిది నేఁటి మ్రుగ్గునకు - ముత్యాలపొడి మాకు ముక్కుస వలయుఁ
గదలక మెదల కీక్షణమాత్రలోనఁ - బదివుట్ల ముత్యముల్ బసవ! యి”మ్మనిన
సరసర [4]లింగపసాయితశస్త్ర - కరతలుఁడై చూడఁ గనుదృష్టి నున్న
జొన్నల [5]ప్రో(C?)క విశుద్ధముక్తాఫ - లోన్నతరాశియై యున్న నవ్వుచును
“సన్నుత! పదివుట్ల సంఖ్య మీకేల? -యెన్ని మీ వలసిన వన్ని గైకొనుఁడు”
అనవుడు “నట్లకా”కనుచు ముత్యములు- గొనిపోయెఁ బెఱికలఁ [6]దనర నన్నియును.

మొఱటద వంకయ్య కథ


మొఱటద వంకయ్య మున్కొక్కనాఁడు - కఱ[7]కంఠభక్తుఁడొక్కరుఁ డర్ధరాత్రి
నరుదేరఁ బొడగని యడుగుల కెరఁగి- సరసోచితక్రియా[8]సంతుష్టుఁ జేయ;
“మాలింగమునకుఁ నేమమ్మొక్క మొదవు-పాలును మారేడుఁబత్తిరి వలయు,
నటుగాని యవసరం బలవడనేర; - [9]దిటసెల్లునో యని యేఁగుదెంచితిమి
ఎడసేయఁ [10]గా దింక నీక్షణంబునను- గడియింపకుండినఁ [11]గాదు గార్యంబు
హరభక్తు లూర లే రొరుల నే నడుగఁ- బొరుగూరి కీ[12]వేళఁ బోవంగరాదు
ఇంకనె” ట్లన నాత్మ నించుకేనియును- గొంకక వంకయ్య గొడ్డు నక్షణమ
కొనివచ్చి యొకవట్టికొఱట సంధించి- మనసిజహరభక్తమండలిఁ దలఁచి
“యీకొఱటన [13]పత్తిరీ గొడ్డునంద- ప్రాకటంబుగఁ బాలు వడయుదు” ననుచుఁ
గుండ వేగమ కడ్గికొనివచ్చి పిదుకఁ - గుండ నిండఁగఁ బాలు గురిసె నాగొడ్డు
కొఱటనె పత్రి యంకురితమై [14]పరిగె- వఱల నామొఱటద వంకయ్య గోసి
తెచ్చి యా భక్తున కిచ్చి నేమంబు - సెచ్చెరఁ జెల్లించెఁ జెప్పఁ జిత్రంబు
అనఁగ విందుము దొల్లి యాద్యోక్తులందుఁ- గనుఁగొంటి మిప్పు డీ కటకంబునందు

  1. రక్తిమై మ్రుచ్చులను బసవయ్య
  2. నిలవట్లుగాక
  3. ఇక్కడ 'నిత్తెనేమ'మనియు 'ముత్తేలపొడి' యనియు దిద్దఁదగియున్నను, వ్రాతప్రతు లన్నింటను నిట్లేయుండుటచేతను, 'నిత్యనేమ' మని యీ కవి మఱికొన్నిచోట్లఁగూడఁ బ్రయోగించుటచేతను, నట్లు చేయలేదు.
  4. వశాయత
  5. ప్రోఁగు
  6. దనకైనయన్ని
  7. కంఠు
  8. సంపన్నుఁ సంపూర్ణుఁ
  9. ఇటు సె
  10. రా
  11. గాదు లేదనిన
  12. ప్రొద్దువో
  13. పత్రియీ
  14. తనరె, పర్వె(ర్వ)